బడ్జెట్ ఎఫెక్ట్... భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు

First Published Feb 1, 2018, 4:04 PM IST
Highlights
  • మొబైల్ ఫోన్లపై బడ్జెట్ ఎఫెక్ట్
  • దిగుమతి చేసుకునే ఫోన్లపై కస్టమ్స్ డ్యూటీ పెంచిన కేంద్రం

రానున్న ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. గురువారం పార్లమెంట్ లో 2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ బడ్జెట్ ప్రభావం ఇప్పుడు మొబైల్ ఫోన్స్ పై పడింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొబైల్‌ ఫోన్లపై కస్టమ్స్‌ డ్యూటీని పెంచారు. ప్రస్తుతం 15శాతంగా ఉన్న కస్టమ్స్‌ డ్యూటీని 20శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ తెలిపారు.

‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా దేశీయంగా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అంతేకాకుండా విదేశాల నుంచి మొబైల్‌ఫోన్ల దిగుమతిని తగ్గించాలని ప్రణాళికలు రూపొందించింది. ఈ నేపథ్యంలోనే  తాజా బడ్జెట్‌లో కస్టమ్స్‌ డ్యూటీని రూ.15శాతం నుంచి 20శాతానికి పెంచారు. ఇప్పటికే శాంసంగ్‌, షియోమి వంటి పలు మొబైల్‌ కంపెనీలు భారత్ లో మ్యానుఫాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకున్నాయి. కాగా.. ఇతర కంపెనీల ఫోన్లపై ధరలు పెరిగనున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం ఒక్కో ఫోన్ ధర రూ.2వేల నుంచి రూ.5వేల వరకూ పెరిగే అవకాశం ఉంది.

click me!