
కృష్ణా జిల్లా పెదపారుపూడి వద్ద గుడివాడ-విజయవాడ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు చనిపోయారు. ఒక మినీ వ్యాన్ వారి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారు గుడ్లవల్లేరు గ్రామానికి చెందిన వారు. విజయవాడ నుండి గుడివాడ వస్తున్న మిని వ్యాన్ డ్రైవర్ అతి వేగంగా వాహనం నడపటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్దానికులు చెబుతున్నారు
గుడ్లవల్లేరు గ్రామానికి చెందిన సోమేశ్వరావు అతని సోదరుడు ద్విచక్ర వాహనం మీద విజయవాడ వెళ్తున్నపుడు ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. సోమేశ్వరరావు,అతని సోదరుడు అక్కడికక్కడే మృతి చెందారు.అతి వేగంగా వ్యాను నడిపి ఇద్దరు మృతికి కారణమైన డ్రైవర్ భయంతో పారిపోయాడు. పెదపారుపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాలను పోస్ట్ మార్టమ్ నిమిత్తం గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు