తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు : వాసన పసిగట్టిన బిజెపి

First Published Feb 28, 2017, 6:46 AM IST
Highlights

ముఖ్యమంత్రి  కెసిఆర్  2018లో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోయేందుకు సిద్ధమవుతున్నారు

తెలంగాణాలో  2019 కంటే ముందే అసెంబ్లీ  ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీ అనుమానిస్తున్నది. దీనికి కారణం కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలే నంటున్న భారతీయ జనతా పార్టీ నాయకుడు కృష్ణ సాగర్ రావు. ఎన్నికల హామీలు ఇంతరకు నెరవేర్చలేదు. ఇక ముందు  నెరవేర్చే శక్తి లేదు. అందువల్ల ఎన్నికలకు వెళ్లడం వల్ల ఈ అపవాదు నుంచి బయటపడవచ్చని, దీనికోసం కెసిఆర్  ఇపుడు లెక్కలేస్తున్నారని ఆయన చెబుతున్నారు.  కృష్ణ సాగర్ రావు చెబుతున్న కారణాలు ఇవి :

 

1.ఒక్క ఎన్నికల వాగ్దానం ముఖ్యమంత్రి కెసిఆర్ నెరవేర్చేలేదు. మూడేళ్లవుతుూ ఉంది కాబట్టి  ఇక ముందు నేరవేర్చేందుకు ఆర్థిక పరిస్థితి బాగా లేదు.

 

2. రెవిన్యూ పడిపోయింది. రుణభారం మోపడయింది. రు. 1.5 లక్షల కోట్లకు రుణ భారం పెరిగింది. రుణ మాఫీ వంటి హామీలను ముఖ్యమంత్రి నెరవేర్చాలనుకున్నా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు.

 

3. ముఖ్యమంత్రి ఇపుడు కుల సంఘాలను మచ్చికచేసుకోవాలనుకుంటున్నారు. దీనికోసం వాళ్లకి పెద్ద ఎత్తున తాయిలాలను ప్రకటిస్తున్నారు. ఇక ముందు అందరికి తాయిలాలను ప్రకటించడమే ఉంటుంది.

 

4. ఇపుడు ఎస్ సి,ఎస్ టి వర్గీకరణ సమస్యను లేవనెత్తేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రస్తావనకు కూడా నోచుకోని ఈ విషయం మీద ముఖ్యమంత్రి తెగ మాట్లాడుతున్నారు. ఒక అఖిల పక్ష బృందాన్ని ఢిల్లీ తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు.  ఇక బిసి సంక్షేమం గురించి ఉపన్యాసాలు వినపడతాయి.

 

5 . అధికారంలోకి దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఇపుడు ఆయనకు  అకస్మాత్తుగా ఎపుడో దేవతలకు మొక్కుకున్న మొక్కుబడులు గుర్తొస్తున్నాయి.  గుళ్లకు కానుకలు అందిస్తున్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. దేవుడికి మొక్క వ్యక్తిగతమయితే, తెలంగాణా వచ్చిన వెంటనే ఎందుకు తీర్చుకోలేదు. దాదాపు మూడేళ్లు ఎందుకు ఆగాల్సి వచ్చింది.

 

6.కారణం , ఆయన అన్ని మతాల వారిని సంతృప్తి పరచాలనుకుంటున్నారు. తెలంగాణా ఏర్పడి మూడేళ్లవుతున్న సందర్భంగా వాతావరణం ఎలా ఉంది,ఓట్లెలా వెళ్తాయి అనే లెక్కలేసుకుంటున్నారు

 

ఇవన్నీ ఆయన మధ్యంతర ఎన్నికల గురించి యోచిస్తున్నారనేందుకు సంకేతాలు. 2018 లో కెసిఆర్ అసెంబ్లీ రద్దు చేసి  ఎన్నికలు పోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ప్రతిపక్షాలు సంసిద్ధంగా లేనపుడు అసెంబ్లీ ఎన్నికలు పోవడం వల్ల ప్రయోజనం ఎక్కువని కెసిఆర్ భావిస్తున్నారు.

click me!