
ఓ బీజేపీ నేతపై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. కారులో వెళ్తున్న ఆయన వాహనాన్ని అడ్డుకోవడం మాత్రమే కాదుఆయను కారులో నుంచి కిందకు లాగిపడేశారు. అనంతరం కాళ్లతో దారుణంగా తన్నారు. ఈ సంఘటన బెంగాల్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బీజేపీ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామపాద మండల్ శుక్రవారం సాయంత్రం కారులో వెళ్తుండగా ఈ ఘటనచోటుచేసుకుంది. దాదాపు డజన్ మంది.. ఆయన కారును అడ్డుకున్నారు. కారుని ధ్వంసం చేశారు. అనంతరం ఆయనపై కూడా దాడి చేశారు. బీజేపీ నేతపై దాడి చేసిన వారిలో కొందరు హెల్మెట్లు ధరించగా.. మరికొందరు ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని ఉన్నారు. కాగా వారంతా తృణముల్ పార్టీ నేతలుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఘటనను కొందరు వీడియో తీయగా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.