బ్యాంకుల స్కాంపై సిబిఐ కొరడా

Published : Nov 30, 2016, 03:01 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
బ్యాంకుల స్కాంపై సిబిఐ కొరడా

సారాంశం

రెండు తెలుగు రాష్ట్రాల్లోని వెయ్యి శాఖల్లోనే భారీ ఎత్తున కుంభకోణం జరిగితే మరి దేశమంతటా ఏ స్ధాయిలో స్కాం జరిగి ఉంటుందో ఎవరి ఊహకూ అందటం లేదు.

బ్యాంకు శాఖలు కూడా ఎంత హీన స్ధితికి దిగజారాయో అర్ధమవుతోంది. దేశప్రజల అవసరాలే పెట్టుబడిగా స్వయంగా బ్యాంకులే సరికొత్త స్కాంకు తెరలేపటం గమనార్హ. కొత్త నోట్ల మార్పిడి స్కాంలో వెయ్యి బ్యాంకు శాఖలకు ప్రమేయంపై సిబఐ విచారణ ముమ్మరం చేయటం ఆశ్చర్యంగా ఉంది. రాజకీయ నేతల ప్రమేయం లేకుండానే ఉంటుందా ? ప్రధానమంత్రి నవంబర్ 8 తేదీన పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత కుంభకోణానికి తెరలేచినట్లు సమాచారం. ఇందులో బ్యాంకు అధాకురులు, సిబ్బందిదే ప్రధాన పాత్రంగా ఇప్పటికి తేలింది.

 

 రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు వెయ్యి బ్యాంకు శాఖల్లో ఇటువంటి కుంభకోణం జరిగినట్లు ప్రాధమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వెయ్యి శాఖల్లోనే భారీ ఎత్తున కుంభకోణం జరిగితే మరి దేశమంతటా ఏ స్ధాయిలో స్కాం జరిగి ఉంటుందో ఎవరి ఊహకూ అందటం లేదు.    అయితే జరిగిన స్కాంలో ఒక్క బ్యాంకుల పాత్ర మాత్రమే ఉంటుందని ఎవరూ అనుకోవటం లేదు.

 

నల్లదన కుభేరులు, రాజకీయ నేతల పాత్ర లేకుండా ఏ కుంభకోణం కూడా జరగదన్నది ప్రపంచానికంతటికీ తెలుసు. నవంబర్ 10-15 తేదీల మధ్యే ప్రధానంగా స్కాం చోటు చేసుకున్నట్లు సమాచారం. స్కాం జరిగిన విషయం నిర్ధారణ కాగానే రిజర్వ్ బ్యాంకు వెంటనే సిబిఐని అప్రమత్తం చేసింది. దాంతో సిబిఐ వెంటనే విచారణ కూడా మొదలుపెట్టింది.  పై తేదీల్లో జరిగిన లావాదేవీల వివరాలను అనుమానం ఉన్న శాఖల నుండి సిబిఐ తెప్పించుకుంటోంది.

 

రూ. 2 వేల నోట్లు, రూ. 100 నోట్లు  భారీగా బ్యాంకుల నుండే పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. చాలా బ్యాంకు శాఖల నుండి ఇప్పటికే అవసరమైన ఆధారాలను ఆయా బ్యాంకు అధికారులు సిబిఐకి అందచేసాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం జరిగిన స్కాం విలువ సుమారు రూ. 2 వేల కోట్లపై మాటే. లక్షల ఖాతాల్లో వినియోగదారుల జిరాక్స్ కాపీలను సమర్పించి అనేక సార్లు వివిధ శాఖల్లో నగదు మర్పిడి చేసుకున్నట్లు నిర్ధారణైంది.

 

విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, వరంగల్, తిరుపతి, హైదరాబాద్, ఏలూరు, కరీనంగర్, కడప, శ్రీకాకుళం, నెల్లూరు, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, ఖమ్మం, ఒంగోలు, నల్లగొండ, మంచిర్యాల, నంద్యాల తదితర ప్రాంతాల్లో ఇటువంటి స్కాంకు తెరలేచింది.

 

పనిలో పనిగా బ్యాంకుల పాత్రపై సిబిఐ విచారణ జరుపుతూనే నల్లధన కుభేరులు, రాజకీయ నేతల పాత్రపైన కూడా విచారణ జరుగుతోంది. ఏపిలోని అధికార పార్టీలోని పలువురు ప్రముఖుల ఒత్తిళ్లతోనే బ్యాంకు అధికారులు స్కాంకు పాల్పడినట్లు కూడా వెల్లడవుతున్నట్లు సమాచారం. ఇందులో ఒకరిద్దరు మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏల పాత్రపైన కూడా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !