టీచర్ల బీహేవియర్ కి పరీక్ష

Published : Sep 14, 2017, 01:15 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
టీచర్ల బీహేవియర్ కి పరీక్ష

సారాంశం

సీబీఎస్ఈ కిందకు వచ్చే దాదాపు 19,500 పాఠశాలల్లోని 10లక్షల మంది ఉద్యోగులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు భారత్ లో సీబీఎస్ఈ కిందకు 1100 కేంద్రియ విద్యాలయాలు, 600 జవహర్ నవోదయ విద్యాలయాలు, 2700 ప్రభుత్వ పాఠశాలలు,14,900 ప్రైవేటు పాఠశాలలు

స్కూల్లో పరీక్షలు విద్యార్థులు రాస్తారు. వారు అందులో పాసయ్యారో, ఫెయిల్ అయ్యారో టీచర్లు చెబుతారు. అయితే సీబీఎస్ఈ మాత్రం విద్యార్థులకు కాదు.. టీచర్లకే పరీక్ష పెడుతోంది. ఈ పరీక్షలో ఉపాధ్యాయులు ప్రవర్తన బయటపడుతుంది.  పాఠశాలల్లో పాఠాలు బోధించే.. టీచర్లకు బీహేవియర్( ప్రవర్తన, నడవడిక) పరీక్ష నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. తమ పిల్లలు.. మంచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తల్లిదండ్రులు స్కూల్ కి పంపిస్తారు. అక్కడ వారికి విద్యను భోధించాల్సిన ఉపాధ్యాయులు కీచకంగా ప్రవర్తిస్తే.. వారి భవిష్యత్తు ఏమి కావాలి. అందుకే.. టీచర్ల ప్రవర్తన తెలుసుకునేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. కేవలం టీచర్లకు మాత్రమే కాదు.. పాఠశాలలో పనిచేసే ఇతర సిబ్బందికి కూడా ఈ టెస్ట్ పెడుతున్నారు.

 

ఇటీవల గుర్గావ్ లో ఓ చిన్నారిని బస్ డ్రైవర్ దారుణంగా హత్య చేసిన సంఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ కిందకు వచ్చే దాదాపు 19,500 పాఠశాలల్లోని 10లక్షల మంది ఉద్యోగులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పదిలక్షల మందిలో ఉపాద్యాయులతోపాటు ఇతర పాఠశాల సిబ్బంది కూడా ఉన్నారు. ఈపరీక్ష ద్వారా వ్యక్తి గతంగా వారు మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది, వారి ప్రవర్తన ఎలా  ఉందన్న విషయం తెలుస్తుంది. ప్రముఖ సైకాలజిస్టులతో దీనిని పరిక్షిస్తారు.

 

రెండు నెలల్లో ప్రతి ఒక్కరూ పోలీసుల వద్ద నుంచి సెక్యురిటీ, సేఫ్ ఆడిట్ లు తీసుకొని రావాలని ఈ మేరకు ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. పాఠశాలల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే బస్ డ్రైవర్, క్లీనర్, ప్యూన్ సహా అందరూ పోలీస్, సైకాలజిస్టు దగ్గర నుంచి సర్టిఫికేట్లు తీసుకురావాలని డిప్యుటీ సెక్రటరీ జయప్రకాశ్ చతుర్వేది తెలిపారు.

 భారత్ లో సీబీఎస్ఈ కిందకు 1100 కేంద్రియ విద్యాలయాలు, 600 జవహర్ నవోదయ విద్యాలయాలు, 2700 ప్రభుత్వ పాఠశాలలు,14,900 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని ఆయన వివరించారు. కాగా.. రిక్రూట్ చేసుకోవడానికి ముందే తాము ఉద్యోగుల వద్ద నుంచి ఆ సర్టిఫికేట్లు తీసుకుంటామని మేఘాలయ లోని  నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ అన్నారు. అంతేకాకుండా  ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి సైకోమెట్రిక్ టెస్ట్ సర్టిఫికేట్ తీసుకురావడం కష్టమని.. అందుకే చీఫ్ డిస్ట్రిక్ మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

 

ఇది చాలా మంచి నిర్ణయమని.. కాకపోతే దీనికి చాలా సమయం పడుతుందని కొందరు ఉపాధ్యాయులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి పాఠశాలలోనూ సీసీటీవీ లు ఏర్పాటు చేయాలని అధికారులు చెబుతున్నారు. అవి 24గంటలు పనిచేసేలా చూడాలని వారు అన్నారు. ప్రతి పాఠశాలలోనూ టీచర్లు.. విద్యార్థుల తల్లిదండ్రులతో మీట్ అవుతూ ఉండాలని.. వారి వద్ద నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకోవాలని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !