
కోర్టు ఉత్తర్వులు పాటించే క్రమంలో పోలీసులు మంచానికే పరిమితమైన ఓ మహిళను ఇంటి నుంచి ఈడ్చుకెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.
ఈ సంఘటన కర్ణాటకలో ఆదివారం చోటుచేసుకుంది. మూడేళ్ల కిందట బబిత భర్త శ్రీనివాస్ మృతి చెందాడు అప్పటి నుంచి బబిత కూడా రోగంతో మంచానపడింది.
ఆమెకు 14 ఏళ్ల కూతరు కూడా ఉంది. శ్రీనివాస్ మృతితో ఆమె తల్లి ఇంటిని అన్న పేరున రాసింది. దీంతో అతడు ఇళ్లు ఖాళీ చేయాలని బబితకు కోర్టు నుంచి నోటీసులు పంపించాడు.
అయితే బబితకు వేరే చోట నివాసం లేదు. కనీసం సొంత ఆస్తి కూడా ఏమీ లేకపోవడంతో అదే ఇంటిలో ఉండిపోయింది.
కానీ, కోర్టు ఉత్తర్వుల అమలు చేయాలని ఆదేశించడంతో పోలీసులు ఆదివారం మంచానికే పరిమితమైన ఆమెను ఇంటి నుంచి తరలించారు. స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేర్పించారు.