ఏపి రాజకీయాల్లో పెను మార్పులా?

Published : Dec 10, 2016, 10:14 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ఏపి రాజకీయాల్లో పెను మార్పులా?

సారాంశం

నారా బ్రాహ్మణి ద్వారా మార్పులు వ‌స్తాయని వేణుస్వామి చెప్పారు.

తమిళనాడు సిఎం జయలలిత మరణంతో జ్యోతిష్కులు ఒక్కసారిగ విజృభిస్తున్నారు. తాము అమ్మ మరణాన్ని ఏనాడో చెప్పామని, అనారోగ్యంతో ఆసుపత్రి పాలౌతుందని తాము చెప్పిన జోస్యం నిజమైందని చెబుతున్నారు. దాంతో వారు ఊరుకోకుండా ఏకంగా వీడియోలే విడుదల చేస్తున్నారు.

 

అటువంటి వారిలో పరాంకుశం వేణుస్వామి చెబుతున్న జోస్యం కలకలం రేపుతోంది. వేణుస్వామి చెప్పిన జోస్యం ఏపి రాజకీయాలపై కావటంతో తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది.

 

రాజ‌కీయ జ్యోతిష్యుడు ప‌రాంకుశం వేణుస్వామి తాజాగా మ‌రో బాంబు పేల్చారు. అతిత్వరలో ఏపీ ముఖ్యమంత్రికి పదవీగండం ఉందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం జయలలిత విషయంలో తాను చెప్పిందే జరుగుతుందన్నారు.

 

పన్నీర్ సెల్వం కధ కూడా మున్నాళ్ల ముచ్చటేనని ఓ స్త్రీ కారణంగా పన్నీర్ పదవికి ఆటంకం కలుగుతుందని తెలుస్తోంది. ఆ స్త్రీ శశికళే అను అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, పైగా ప్రధాని మోదికి కూడా జనవరి 26న ఇబ్బందుల్లో పడతాడని, నోట్లరద్దుతోనే ఆయన ఇబ్బందులు మొదలైనట్టు చెప్పారు.

 

2017 ఫిబ్రవ‌రి త‌ర్వాత ఏపీ రాజ‌కీయాల్లో పెనుమార్పులు వ‌స్తాయ‌ంటున్నారు. 2017లో చంద్రబాబు ప‌ద‌వికి దూరం అవుతారట. బాబు కుటుంబంలోనూ ముస‌లం పుడుతుందట. ఇవన్నీ ఆయ‌న పంచాంగం గుద్ది మ‌రీ చెబుతున్నారు.

 

ఆయ‌న జోస్యం ప్రకారం 2017 ఫిబ్రవ‌రి 26 త‌ర్వాత శ‌నిలో మార్పులు వ‌స్తాయి.. దీంతో చంద్ర‌బాబు ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. న‌రాల సంబంధమైన‌ వ్యాధి లేదా మెద‌డుకు సంబంధించిన వ్యాధితో ఆయ‌న ప‌ద‌వికి దూర‌మ‌వుతారని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో బాబు కుటుంబంలో ఓ స్త్రీ వ‌ల్ల విభేదాలు త‌లెత్తుతాయ‌ని చెప్పుకొచ్చారు.

 

నారా బ్రాహ్మణి ద్వారా మార్పులు వ‌స్తాయని వేణుస్వామి చెప్పారు. లోకేష్‌కి మంత్రి ప‌ద‌వికి సంబంధించో లేక త‌న తండ్రి బాల‌య్యకు మంత్రి ప‌ద‌వి విషయంలోనో బ్రాహ్మ‌ణి ప‌ట్టు ప‌డుతుందని జోస్యం చెబుతున్నారు.

 

దీంతో బాబు ఫ్యామిలీలో ఆడ‌వారి వ‌ల్ల ఇబ్బందులు వ‌స్తాయన్న పంచాంగాన్ని గుద్ది మరీ చెబుతున్నారు. దాని ఫలితంగానే చంద్రబాబు పదవికోల్పోతాడని అంటున్నారు. ప‌రాంకుశం వేణుస్వామి చెబుతున్న జోస్యం ఏపీ రాజ‌కీయవ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu