భారత్ కు సునామి ముప్పు ?  ప్రధాని మోదీకి లేఖ

First Published Sep 30, 2017, 9:31 PM IST
Highlights
  •  డిసెంబర్ 31 లోపు హిందూమహా సముద్రంలో భారీ భూకంపం  
  • 11 దేశాలమీద ప్రభావం

భారతదేశానికి మరొక  సునామి ముప్పు ఉందా? ముప్పు ఉందని, 2018 డిసెంబర్ 31లోపు సునామి భారత్ తో పాటు అనేక దేశాలను అతలాకుతలం చేయనుందని కేరళ కు చెందిన  బికె రీసెర్చ్ అసోసియేషన్ ఫర్ ఇ ఎస్ పి. హెచ్చరిస్తున్నది. హిందూమహా సముద్రంలో వచ్చే భూకంపం వల్ల ఇది సంభవించనుంది. ఈ హచ్చరికను ఈ సంస్థ అధిపతి బాబు కలాయిల్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాస్తూ చెప్పారు.

హిందూ మహా సముద్రంలో డిసెంబర్ 31 లోపు సునామి వస్తున్నదని తమ సంస్థ పసిగట్టిందని, ఈ సునామీ ఆసియా దేశాలను కుదిపేయనుందిని ఈ లేఖలో  ఆయన పేర్కొన్నారు.  ఈ భారీ సునామీ సముద్ర ఒడ్డులను తారు మారు చేస్తుందని చెబుతూ  దీని ప్రభావం పదకొండు దేశాలలో అంటే భారత్, చైనా, జపాన్, పాకిస్తాన్, నేపాల్, బాంగ్లాదేశ్,ధాయ్ లాండ్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంల మీద ఉంటుందని ఈ సంస్థ లేఖలో పేర్కొంది.

హిందూ మహాసముద్రంలో వచ్చే ఈ భూకంపం వ్లల సీష్మా అనే తుఫాను వస్తుందని, ఫలితంగా  120 నుంచి 180 కి.మీ వేగంతో గాలలు వీస్తాయని  బాబు హెచ్చరిస్తున్నారు.

ఈ బాబు కలాయిల్ తనలో అతీంద్రియ శక్తులన్నాయని చెప్పుకుంటు ఉంటాడు.  2004 డిసెంబర్ లో సునామి రాకను కూడా తాను రెన్నెళ్ల ముందే   పసిగట్టి హెచ్చరిక చేశారని  చెబుతాడు. అయితే, జియాలిస్టులు దీన్ని అబద్దంగా కొట్టి పడేస్తున్నారు.

click me!