ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

Published : Aug 09, 2017, 10:28 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

సారాంశం

పునరుజ్జీవ సభకు భారీగా ఏర్పాట్లు హైదరాబాద్ లో పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పై రోడ్డు ప్రమాదం  దీక్ష విరమించిన పొన్నం ప్రభాకర్ హయత్ నగర్  లోని  నారాయణ కళాశాల   విద్యార్థిని ఆత్మహత్య లీలావతి ఆసుపత్రిలో నుంచి దిలీప్ కుమార్  డిశ్చార్జ్  మరాఠా యువమోర్చ  ఆద్వర్యంలో 10 లక్షల మందితో భారీ ర్యాలి

 

గులాబి కూలీ కాదు, అవినీతి కూలీ - రేవంత్ రెడ్డి


గులాబి కూలీల పేరుతో టీఆరెస్స్ పార్టీ బహిరంగంగా అవినీతికి పాల్పడిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ, ఎలక్షన్ కమీషన్, సిబిఐ, ఎసిబి లకు రేవంత్ ఫిర్యాదు చేశారు.అది గులాబి కూలి కాదు బహిరంగ అవినీతి అని రేవంత్ పేర్కొన్నారు. గులాబి కూలి పేరుతో చట్టవిరుద్దమైన  వసూళ్లకు పాల్పడ్డ మంత్రులపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించాలని అన్నారు. గులాబీ కూలీలను జైళ్లలో పెట్టాలన్నారు రేవంత్ రెడ్డి. 
 

మరాఠా రిజర్వేషన్లే లక్ష్యం - మరాఠా క్రాంతి మోర్చా

 
మహారాష్ట్ర మూల వారసులమైన మేము, నేడు రాష్ట్రంలో అనేక విధాలుగా వివక్షను ఎదుర్కొంటున్నామని మరాఠా క్రాంతి మోర్చా సభ్యులు తెలిపారు. మరాఠాలను ప్రజాప్రతినిధులుగా గెలిపించుకున్నప్పటికి, వారు తమ వర్గీయులకు చేసిందేమి లేదని మరాఠాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కుదించి, తమకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ  మరాఠా క్రాంతి మోర్చాఆద్వర్యంలో ముంబైని దిగ్బంధించారు.  సుమారు  పది లక్షల మందితో భారీ   బైకుల్లా నుంచి ఆజాద్ మైదానం వరకు కాషాయ జెండాలను చేతబూని మౌన ప్రదర్శన చేశారు. 
 

ఎంత వ్యంగ్యమో....

   

                   
 నిన్నటి నుంచి హైదరాబాద్ లో బోరున వర్షం. రోడ్లమీద జీవితం నరక ప్రాయమయింది. ఆఫీసులకు వెళ్లే వారంతా  ట్రాపిక్ జామ్ లలొో ఇరుక్కుపోయారు. నగరంలో చాలా చోట్ల వాన నీళ్లు నిలిచిపోయి చిన్న చిన్న సముద్రాలు ఏర్పడ్డాయి. దీని మీద ఒక వ్యంగ్యాస్త్రం.

మెరుగుపడ్డ దిలీప్ కుమార్ ఆరోగ్యం

అలనాటి బాలీవుడ్ హీరో దిలీప్‌కుమార్ ఆరోగ్యం పూర్తిగా  మెరుగుపడింది. గత కొన్ని రోజులుగా  లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దిలీప్ కొద్దిసేపటి క్రతమే డిశ్చార్జ్ అయ్యారు. దిలీప్ కుమార్ వారం రోజులగా హాస్పిటల్లో  కిడ్నీ  సమస్యలపై చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆయన డిశ్చార్జీ గురించి తెలుసుకున్న అభిమానులు హాస్పిటల్ వద్దకు చేరుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.  

 

మరో కార్పోరేట్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య

 

హయత్ నగర్ దగ్గర నాగోల్  రహదారి సమీపం లో గా నారాయణ కళాశాల లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న త్రావ్య అనే విద్యార్థిని హాస్టల్  రూమ్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే నాగోల్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు  డాక్టర్ లు తెలిపారు. కళాశాల యాజమాన్యం  వేధింపుల వల్లే మనోవేదనకు గురై తమ కూతురు ఆత్మహత్య చేసుకుందనితల్లిదండ్రులు  ఆరోపించారు.  

అమరణ దీక్ష విరమించిన పొన్నం ప్రభాకర్

కరీంనగర్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుపై గత ఆదురోజులుగా అమరణ దీక్ష చేస్తున్నమాజా ఎంపీ పొన్నం ప్రభాకర్ నేడు దీక్ష విరమించారు. పొన్నం చేత మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. నిన్న దీక్షాస్థలి నుంచి పొన్నంను పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.  వైద్యానికి నిరాకరిస్తున్న పొన్నం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతున్నందునే విరమింపచేయాల్సి వచ్చిందని జైపాల్ రెడ్డి తెలిపారు.  

 

ప్రమాదానికి కారణమైన వర్షం

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పై రోడ్డు ప్రమాదం జరిగింది. వర్షం కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించక ఆరామ్‌ఘర్‌ చౌరస్తా సమీపంలో  పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే పై శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వైపు వెళ్తున్న నాలుగు కార్లు ఒకదాని వెనుక  వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పినా, పలువురికి  తీవ్ర గాయాలయ్యాయి. వర్షం కారణంగా ముందే నెమ్మదిగా సాగుతున్న ట్రాఫిక్‌, ఈ ప్రమాదం వల్ల మొత్తానికే ఆగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించడంతో పాటు, ట్రాఫిక్‌ ను క్రమబద్దీకరించారు. 

నేరెళ్ల  ఘటనపై కమిటీ వేసిన హైకోర్టు 

నేరెళ్ల బాధితుల ఒంటిపై ఉన్న గాయాలు పోలీసులు కొట్టినవి కావని ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై నిజానిజాలు తేల్చడానికి  హైకోర్టు MGM వైద్యులతో కమిటీ వేసింది. వారి ఒంటిపై ఉన్నవి  పాత గాయాలా, లేక పోలీసుల 3rd డిగ్రీ గాయాలా అన్నది తేల్చనునుంది కమిటీ.   గాయాలెలా అయ్యాయో వచ్చేవారం  తమ నివేదికను సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
 

అమరావతి భూకేటాయింపులపై మరో కేసు

ఆంధ్రప్రదేశ్‌ రాజదాని అమరావతి భూములపై కోర్టు కేసుల పరంపర కొనసాగుతుంది. భూ కేటాయింపులపై అడుసుమిల్లి జయప్రకాశ్‌ దాఖలు చేసిన  పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ నెల 17న   తదుపరి విచారణకు ప్రభుత్వం తన వివరాలు తెలియజేయాల్సిందిగా తెలిపింది అత్యున్నత న్యాయస్థానం.
 

సీఎం బ‌హిరంగ స‌భ‌కు ముస్తాబ‌వుతున్న పోచంపాడు

గురువారం పోచంపాడులో జ‌రిగే ముఖ్య‌మంత్రి బ‌హిరంగ స‌భ‌కు పోచంపాడు వేదిక సిద్ధ‌మ‌వుతున్న‌ది. ఎస్సారెస్పీని నిండుకుండ‌లా ఉంచేందుకు పున‌ర్జీవ ప‌థ‌కానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. కాళేశ్వ‌రం నుంచి గోదావ‌రి జ‌లాల‌ను వివిధ ద‌శ‌ల్లో ఎత్తిపోయ‌డం, రివ‌ర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీని నింపే ప‌థ‌కానికి సీఎం పోచంపాడ్ లో శంకుస్థాప‌న చేయ‌నున్నారు.                        

విచారణకు సహకరించని విక్రమ్ గౌడ్

విక్రమ్ గౌడ్ ను విచారించి కీలకమైన విషయాలు బయటకులాగాలనుకుని, పొద్దున కస్టడీకలోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరయింది. విక్రమ్  ఏ మాత్రం సహకరించలేదని, అసలు నోరు తెరిచి మాట్లాడిందే లేదని విచారణలో పాల్గొన్న పోలీసులు తెలిపారు.  కాల్పుల కేసులో  పోలీస్ కస్టడీ కొద్దిసేపటి క్రింతమే  ముగించినట్లు వారు తెలిపారు.  కోర్టు అనుమతి ముగియడంతో ఆయన్ని మళ్లి చంచల్ గూడకు తరలిస్తున్నారు బంజారహిల్స్ పోలీసులు.  

అభిమానులకు మహేష్ బాబు బర్త్ డే కానుక

మహేష్ బాబు పుట్టినరోజు సంద‌ర్భంగా స్పైడ‌ర్ టీజర్ విడుదల చేసి ప్రిన్స్ అభిమానులకు రెండు పండుగలను ఒకేసారి తెచ్చింది ఆ సినిమా యూనిట్. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు ఏ మాత్రం తగ్గకుండా సినీ అభిమానులను ఉర్రూతలూగించేలా రూపొందించిన ట్రయిలర్ లో బర్త్ డే భాయ్ మహేష్ లుక్ అదిరిపోయింది. మహేష్ - మురుగ‌దాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ స్పైడ‌ర్ పై ఈ టీజర్ మరింత అంచనాలు పెంచింది. 
 

 సంగారెడ్డిలో మెడికల్ కాలేజి స్థాపనే నా లక్ష్యం - జగ్గారెడ్డి

సంగారెడ్డి కి కేటాయించిన మెడికల్ కాలేజిని కేసీఆర్ సిద్దిపేటకు తరలించి జిల్లా ప్రజలకు అన్యాయం చేశాడని వాపోయారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.  దీన్ని అడ్డుకోలేక చేతకానివాడిలా హరిష్ రావు భజన చేస్తున్న  స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పైనా ద్వజమెత్తారు. ప్రభుత్వ తీరుకు నిరసనగ సంగారెడ్డి కాలెక్టరేట్ ముందు ఈనెల 15న ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు . ప్రభుత్వ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కు తాను భయపడేది లేదని,  సంగారెడ్డికి మెడికల్ కాలేజిని సాధించడమే  తనముందున్న ఏకైక లక్ష్యమన్నారు జగ్గారెడ్డి.

పున‌రుజ్జీవ స‌భ‌కు ప్రజలంతా తరలిరండి - ఎంపి క‌విత  

ఎస్సారెస్పీ ప్రాజెక్టు పున‌రుజ్జీవ స‌భ‌ను విజ‌య‌వంతం చేద్దామ‌ని నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత పిలుపునిచ్చారు. బుధ‌వారం జ‌గిత్యాల‌లో ప‌లు కుల సంఘాల‌ నాయ‌కుల‌తో స‌మావేశం అయిన ఆమె ఎస్సారెస్పీ ప్రాజెక్టు జీవ‌న‌దిగా మార‌బోతోంద‌న్నారు. దీని వ‌ల్ల లాభ‌ప‌డే జిల్లాల్లో జ‌గిత్యాల జిల్లా మొద‌టిది అవుతుంద‌న్నారు. వ్య‌వసాయాన్ని లాభ‌సాటిగా మార్చేందుకు ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలిపారు. ఇందులో భాగంగానే కాళేశ్వ‌రం నీటిని రివ‌ర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీని నింపే కార్య‌క్ర‌మానికి సిఎం కెసిఆర్ గురువారం శ్రీకారం చుడుతున్నార‌ని తెలిపారు కవిత.  పోచంపాడులో జ‌రిగే స‌భ‌కు ల‌క్ష‌లాదిగా ప్ర‌జ‌లు హాజ‌రు కావాల‌ని ఎంపి క‌విత కోరారు  బ‌స్సులు, ట్రాక్ట‌ర్లు, మోటార్ సైకిళ్లు, సైకిళ్లు ఏది అందుబాటులో ఉంటే వాటిని ఉప‌యోగించుకుని స్వతహాగా స‌భ‌కు త‌ర‌లిరావాల‌న్నారు ఎంపీ కవిత. 

సిఐ దామోదర్ రెడ్డి పై సస్పన్షన్ వేటు

గద్వాల్ జోగుళాంబ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న  సి.ఐ. దామోదర్ రెడ్డి సస్పెండయ్యారు.  జిల్లా కేంద్రంలో సి.ఐ. గా విధులు నిర్వహిస్తున్న దామోదర్ రెడ్డి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అంతేకాకుండా ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రావడం కారణంగా సస్పెండ్ చేసినట్లు  ఐ.జి. స్టిఫెన్ రవీంద్ర తెలిపారు.

డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సింధు

బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఏపీ డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 

ఆమె సిసిఎల్ఎ అనిల్ చంద్ర పునేతా సమక్షంలో బాధ్యతలు స్వీకరించాల్సి ఉండింది. అయితే,ఆయన అస్వస్థత వల్ల నేడు ఆపీసుకురాలేదు.దీనితో  సీనియర్ అధికారులు రామారావు, జగన్నాథంల  సమక్షంలో  నేడు గొల్లపూడి సీసీఎల్‌ఏ కార్యాలయంలో  డిప్యూటీ కలెక్టర్‌గా సింధు సంతకం చేశారు. 

ఈ సందర్భంగా సింధుకు సీసీఎల్ఏ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. 

ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చింది. 

సింధును డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నియామక పత్రాన్ని అందజేశారు.
 
డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సింధు మాట్లాడుతూ డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 

తనకు మద్దతుగా నిలిచిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సింధు కృతజ్ఞతలు తెలిపారు. 

గోపీచంద్ అకాడమీలో మంచి శిక్షణ పొందుతున్నానని, రాబోయే వరల్డ్ చాంపియన్ షిప్లో బాగా ఆడి విజయం సాధిస్తానని సింధు తెలిపారు.                        
 

అమరుల స్ఫూర్తి యాత్ర

జేఏసి చైర్మన్ కోదండరామ్ చేపడుతున్న అమరుల స్ఫూర్తి యాత్ర నాల్గవదశ వివరాలను జేఏసి వెల్లడించింది.ఆగస్టు 11న మొదలుకానున్న యాత్ర 12న నిజామాబాద్ లో బహిరంగసభతో ముగియనుంది.

 

దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్‌ నరసింహన్‌

 

 

 

 

 

 

 

విజయవాడ:విజయవాడ కనకదుర్గమ్మను గవర్నర్‌ నరసింహన్‌ బుధవారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు గవర్నర్‌కు స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. తర్వాత గేట్ వే హోటల్ లో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు.

 

మూసీలో ఒకరి గల్లంతు 

యాదాద్రి జిల్లా పోచంపల్లి మండల్ పిలాయిపల్లి వద్ద ద్విచక్రవాహనంపై వేళ్తు మూసీ ప్రవాహంలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకు పోయారు.  ఒక వ్యక్తి ని కాపాడిన గ్రామస్తులు, మరో వ్యక్తి గల్లంతు.. నిన్న రాత్రి నుంచి తెలంగాణాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.               

నేడు ఉద్యోగంలో చేరనున్న పి.వి.సింధు 

విజయవాడ: బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు నేడు డిప్యూటి కలెక్టర్గ్ గా ఉద్యోగంలో చేరుతున్నారు.  

విజయవాడ గొల్లపూడిలో ఉన్న ఏపీ భూపరిపాలన(సీసీఎల్‌ఏ) కమిషనర్‌ కార్యాలయానికి బుధవారం ఉదయం రానున్నారు.

ఇటీవల ఆమెను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పత్రాన్ని అందించిన సంగతి తెలిసిందే.

డిప్యూటీ కలెక్టర్‌కు సంబంధించిన విధుల గురించి అధికారులు ఆమెకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉద్యోగంలో చేరుతున్నట్లుగా సీసీఎల్‌ఏ ప్రధాన కమిషనర్‌ పునేతా కు రిపోర్టు చేయనున్నారు.                        ⁠⁠⁠⁠

     

పోలీసు కస్టడీకి విక్రమ్ గౌడ్

కాల్పులు ఘటన లో యూత్ కాంగ్రెస్ నాయకుడు  విక్రమ్ గౌడ్ ను బంజారా హిల్స్ పోలీసులు  బుధవారం నాడు కస్టడీలోకి తీసుకున్నారు.

విక్రమ్ గౌడ్ తో పాటు బాబు జాన్ , గోవింద రెడ్డి , నంద కుమార్ , రయీస్ ఖాన్ , షేక్ అహమ్మద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఐదుగురిని మూడు రోజులు పాటు విచారణ చేస్తారు. చంచల్ గూడ జైల్ నుండి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి కొద్ది సేపటికిందట తరలించారు.

తెల్ల రేషన్ కార్డే అధార్ ఆంధ్రలో...

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వు నెంబరు యం.యస్.229 తేదీ 23.06.2017 రెవెన్యూ ప్రకారం తెల్లరేషన్ కార్డు వున్న వారందరికీ తెల్లరేషన్ కార్డే ఆదాయ దృవీకరణ పత్రం గా పరగణింపడుతుంది.  ఇక ఆదాయ దృవీకరణ పత్రం  కోసం తహశీల్దార్ కార్యాలయాలు/మీసేవ కేంద్రాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. తెల్లరేషన్ కార్డు లేనివారు ఆదాయ దృవీకరణ పత్రం తహశీల్దార్ కార్యాలయాలు/మీసేవ కేంద్రాలకు వెళ్లి ఒకసారి పొందితే నాలుగు సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది.                        
 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !