డ్యూయల్ సిమ్ తో అతి తక్కువ ధరకే ఐఫోన్

First Published Feb 27, 2018, 3:10 PM IST
Highlights
  • త్వరలో బడ్జెట్ ధరలో ఐఫోన్

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల సంస్థ యాపిల్ త్వరలోనే భారత మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్ ని ప్రవేశపెట్టనుంది. యాపిల్ ఐఫోన్లకు ఇతర దేశాలతోపాటు భారత్ లోనూ డిమాండ్ ఎక్కువే. అయితే.. ధర మరీ ఎక్కువగా ఉండటంతో.. చాలా మంది ఐఫోన్ల వైపు చూడటం లేదు. దీంతో.. భారత్ లో ఐఫోన్ కొనుగోళ్లు గత మూడేళ్లుగా తగ్గుతూ ఉన్నాయి. అందుకే.. త్వరలో విడుదల చేయనున్న ఐఫోన్ ని బడ్జెట్ ధరలో విడుదల చేయాలని ఐఫోన్ భావిస్తోంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఐఫోన్లలో కేవలం సింగిల్ సిమ్ సదుపాయం మాత్రమే ఉండేది. కాగా.. రానున్న ఐఫోన్లలో డ్యూయల్ సిమ్ స్లాట్ ని ఏర్పాటు చేయనున్నారు.

అంతేకాకుండా.. ఈ బడ్జెట్ ఐఫోన్ మోడల్‌లో ఎల్‌ఈడీ డిస్‌ప్లేకు బదులుగా సంప్రదాయ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఇక బాడీని అల్యూమినియంతో కాకుండా ప్లాస్టిక్‌తో తయారు చేస్తుందని సమాచారం. ఇక డిస్‌ప్లే టైప్ ఎడ్జ్ టు ఎడ్జ్ మాదిరి ఉంటుందని, సైజ్ 6.5 ఇంచుల వరకు ఉండవచ్చని తెలిసింది. దీని వల్ల ఫోన్ ధర బాగా తగ్గుతుందని సమాచారం.

ఇక బడ్జెట్ ఐఫోన్‌తోపాటు ఐఫోన్ 10ను పోలిన విధంగా ఉండే మరో హై ఎండ్ ఫోన్‌ను కూడా యాపిల్ ఈ ఏడాది విడుదల చేస్తుందని తెలిసింది. దీని డిస్‌ప్లే సైజ్ 5.8 ఇంచుల వరకు ఉంటుందని తెలుస్తున్నది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ ఇంటర్నెట్ ప్రచారం జరుగుతున్నవి మాత్రతమే. చివరకు మరి వీటిలో ఏ ఫీచర్లతో యాపిల్ తన నూతన ఐఫోన్‌ను విడుదల చేస్తుందో వేచి చూడాల్సిందే.

click me!