అనంతపురంలో ఎనర్జీ యూనివర్శిటీ వస్తాంది

First Published Jun 17, 2017, 5:24 PM IST
Highlights

అనంతపురములో ఎనర్జీ యూనివర్శిటీ ఈ ఏడాదే ఏర్పాటువుతున్నది.ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ప్రకటించారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం రు. 400  కోట్లు ఖర్చుచేస్తున్నారు. ఫ్రొఫెసర్ మంధాని అడ్వయిజర్ గా నియమించారు.

అనంతపురములో ఎనర్జీ యూనివర్శిటీ ఈ ఏడాదే ఏర్పాటువుతున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ప్రకటించారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం రు. 400  కోట్లు ఖర్చుచేస్తున్నాట్లు కూడా ఆయన వెల్లడించారు.

శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి  మౌలిక వసతులపై తన నివాసంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు.

ఇలాగే  కాకినాడలో లాజిస్టిక్ యూనివర్శిటీని రూ.350 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని అది కూడా ఈ ఏడాదే  ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

అనంతపురం, కాకినాడలలో ఉండే విశ్వవిద్యాయాల అధికారులతో మాట్లాడుకుని తాత్కాలిక క్యాంపస్‌లను ఏర్పాటుచేసుకుని ఈ విద్యా సంవత్సరం నుంచి కార్యకలాపాలను ప్రారంభించాలని  ఆయన సమావేశంలో అధికారులను ఆదేశించారు.

2018 చివరి నాటికి సొంత భవనాలు నిర్మించుకుని అక్కడి పనిచేసేందుకు ఏర్పాట్లు చేయాలని  సూచనలిచ్చారు.

ఎనర్జీ యూనివర్శిటీకి నెడ్‌క్యాప్‌ యాంకర్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నట్టు ఆ సంస్థ  మేనేజింగ్ డైరెక్టర్ కమలాకరరావు చెప్పారు. సలహాదారుగా మాజీ  ప్రొఫెసర్ మంథాను నియమిస్త్తున్నట్టు తెలిపారు.

ెండో దశ విద్యుత్ సంస్కరణలతో విద్యుత్ వ్యయం తగ్గిస్తున్నామని, వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు తగ్గించే పరిస్థితులు తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన నాలుగు భారీ సోలార్ విద్యుత్ పార్కుల్లో అనంతపురములోని 250 మెగావాట్ల ప్లాంట్ పూర్తి కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

click me!