ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ ఆఫర్లతో సమ్మర్ సేల్ ప్రారంభిస్తోంది. మే 4-7 వరకు నాలుగు రోజులపాటు సాగే అమెజాన్ సమ్మర్ సేల్‌లో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో సేల్స్ రికార్డు నమోదు చేసేందుకు సిద్ధమైంది.
ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ ఆఫర్లతో సమ్మర్ సేల్ ప్రారంభిస్తోంది. మే 4-7 వరకు నాలుగు రోజులపాటు సాగే అమెజాన్ సమ్మర్ సేల్‌లో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో సేల్స్ రికార్డు నమోదు చేసేందుకు సిద్ధమైంది.
కాగా, అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు శుక్రవారం(మే 3) మధ్యాహ్నం 12గంటలకు ఎర్లీ ప్రివ్యూ ఆఫర్ చేస్తోంది. సమ్మర్ సేల్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకునే కస్టమర్లకు రూ. 5లక్షల విలువైన బహుమతులు ప్రకటించింది.
స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్ టాప్స్, టీవీలు, అప్లయెన్సెస్, హెడ్‌ఫోన్స్, స్పీకర్లు, ఇతర మేజర్ ఉత్పత్తులపై ఈ సందర్భంగా భారీ ఆఫర్లను అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయిన అమెజాన్.. ఆ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ప్రకటించింది.
ఐఫోన్ ఎక్స్, వన్‌ప్లస్ 6టీ, శామ్సంగ్ గెలాక్సీ ఎస్9, శామ్సంగ్ గెలాక్సీ ఎం20 లాంటి మొబైల్స్‌పై ఆఫర్లు అందిస్తున్నట్లు ఇప్పటికే అమెజాన్ వెల్లడించింది.
గత ఏడాది భారత్‌లో రూ. 37,999 ధరతో లాంఛ్ అయిన వన్ ప్లస్ 6టీపై అమెజాన్ ఇప్పటికే రూ. 3వేలు డిస్కౌంట్ ప్రకటించగా.. సమ్మర్ సేల్‌లో మరింత తక్కువ ధరకే అందుబాటులో ఉంచనుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎం20ని రూ. 9,990కే ఆఫర్ చేస్తోంది. రూ. 71,000తో లాంఛ్ అయిన గెలాక్సీ ఎస్ 10ను రూ. 61,900కే అందిస్తోంది.
జియోమీ ఎంఐ ఏ2 ధర రూ. 17,499 కాగా, ఈ అమెజాన్ సేల్‌లో రూ. 10,999కే లభిస్తోంది. రెడ్‌మీ6ని అమెజాన్ పేతో కొనుగోలు చేస్తే రూ. 500 విలువైన క్యాష్ బ్యాక్ లభిస్తుంది. రూ. 17,999 విలువ గల హానర్ 8ఎక్స్ మొబైల్ రూ. 12,999కే ఆఫర్ చేస్తోంది.
స్మార్ట్‌ఫోన్లను వదిలేస్తే.. ఎలక్ట్రానిక్ వస్తువులపై 55శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఎంపిక చేసిన ల్యాప్‌టాప్ లపై రూ. 32,000 వరకు, హెడ్ ఫోన్స్, స్పీకర్లపై 60శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. వీడియో గేమ్స్, వీడియో గేమ్స్ కన్సోల్స్ పై 50శాతం వరకు తగ్గింపు ఇస్తోంది.
అమెజాన్ బేసిక్స్ ఉత్పత్తులపై 60శాతం, ఫైర్ టీవీ స్టిక్, కైండిల్ ఈబుక్, అమెజాన్ ఇకో స్మార్ట్ స్పీకర్లపై రూ. 4,600 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అమెజాన్ అందిస్తున్న ఈ భారీ ఆఫర్లను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి.