ఫ్యూచర్ ఈజ్ ప్రైవేట్.. తేల్చి చెప్పిన ఫేస్‌బుక్ సీఈఓ జుకర్ బర్గ్

By Siva Kodati  |  First Published May 1, 2019, 12:31 PM IST

వివిధ దేశాల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌లో సమూల మార్పులు తెచ్చినట్లే కనిపిస్తున్నది. 


‘ఫ్యూచర్ ఈజ్ ప్రైవేట్ అని నేను నమ్ముతున్నా’ అని ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కాలిఫోర్నియాలోని శాంజోస్‌లో ప్రారంభమైన రెండు రోజుల ఫేస్ బుక్ ‘ఎఫ్8’ 2019 యాన్యువల్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో జుకర్ బర్గ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రైవస్ ఫోకస్డ్ విజన్‌ను ప్రకటించారు. 

మైక్ ఎనర్జీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ సదస్సులో మార్క్ జుకర్ బర్గ్ పూర్తిగా క్రిటికల్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ప్రైవసీ హక్కులను కాపాడగల సమర్థవంతమైన సంస్థగా పేరు సంపాదించుకోలేకపోయామని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. 

Latest Videos

undefined

గంట సేపు సాగిన ‘కీ’ నోట్ ప్రసంగంలో మార్క్ జుకర్ బర్గ్.. ఫేస్ బుక్ రూపురేఖలు, డిజైన్లలో మార్పులను హైలేట్ చేశారు. మెసెంజర్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యాప్ తదితరాల డిజైన్లను ‘ప్రైవసీ’కి అనుకూలంగా రీ డిజైన్ చేయనున్నట్లు ప్రకటించారు. 

ఫేస్ బుక్ ఇక ‘ప్రైవేట్ సోషల్ మీడియా’గా రూపుదిద్దుకోనున్నదన్న సంకేతాలిచ్చారు. అయితే ప్రైవేట్ సోషల్ మీడియా వేదికగా ఫేస్ బుక్ రూపాంతరం చెందేందుకు చాలా సమయం తీసుకుంటుందన్నారు. ఇదెలా సాధ్యం అన్న ప్రశ్నలన్నింటికీ తమ వద్ద సమాధానాల్లేవని కూడా తేల్చేశారు. 

ఫేస్ బుక్ మెసేంజర్ లో మార్పులను గురించి జుకర్ బర్గ్ వివరిస్తూ తమ సంస్థ చాట్ యాప్స్ సీక్రెట్ చాట్స్ ఇక వాట్సాప్ తరహా మద్దతుతో కూడిన ఎండ్ టు ఎండ్ ఎన్ స్క్రిప్ట్‌డ్ కన్వర్షన్స్‌గా మారతాయని చెప్పారు.

అంతే కాదు మెసేంజర్ సొంతంగా డెస్క్ టాప్ యాప్ రూపొందించుకుంటుంది. ఇది విండోస్, మాకోస్ వద్ద ఈ ఏడాది చివరిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఫేస్ బుక్ కోర్ ప్లాట్ ఫామ్‌లో కీలక మార్పులు జరుగనున్నాయన్నారు. ఫేస్ బుక్ యాప్ పూర్తిగా రీ డిజైన్ చేస్తామని మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు.

ఎఫ్ బీ 5గా పిలువబడే నూతన ఫేస్ బుక్ యాప్ ‘న్యూ యూజర్ ఇంటర్ పేస్’గా వ్యవహరిస్తుందన్నారు. ఐకానిక్ ఫేస్ బుక్ బ్లూ కలర్డ్ లోగో కూడా మోడీఫై కానున్నది. కంపెనీ తమ సంస్థ గ్రూపులు, కమ్యూనిటీలపై కేంద్రీకరిస్తుంది. 

click me!