సీబీ ఐటీలో రియల్ హీరో..!

First Published Aug 9, 2017, 4:24 PM IST
Highlights
  • డ్రగ్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
  • మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్నారు

 

నిన్న మొన్నటి దాకా.. హీరో అంటే కావలం.. సినిమాలో తప్ప నిజజీవితంలో ఉండరనే భావన ఉండేది. కానీ.. ఏరోజైతే.. డ్రగ్స్ కేసులో సినీ నటులు, డైరెక్టర్లను సైతం విచారణ చేసి... నిజాలు బయటకు తీసుకువచ్చారో.. ఆ రోజు నిజమైన హీరోని ప్రపంచం చూడగలిగింది. ఆయనే అకున్ సబర్వాల్. అందుకే నగరంలోని పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులు ఆయనను తమ విద్యాసంస్థకు పిలిపించి మరీ  ఆయన చేత విద్యార్థులకు ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారు.

ఈరోజు.. ఆబ్కారీశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ .. సీబీ ఐటీ(చైతన్య భారతీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డ్రగ్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ వాడకూడదంటూ విద్యార్థులకు సూచించారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నా.. లేదా తీసుకోవాల్సిందిగా తమను ప్రేరేపించినా.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన విద్యార్థులను కోరారు.

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో అకున్ సబర్వాల్ పలువురు సినీ ప్రముఖులను విచారించిన సంగతి తెలిసిందే.

click me!