ఆళ్లగడ్డ టిడిపిలో ఉండేదెవరు? ఊడేదెవరు?

First Published Apr 26, 2018, 11:59 AM IST
Highlights

ఆళ్లగడ్డ టిడిపిలో ఉండేదెవరు? ఊడేదెవరు?

( జింకా నాగరాజు)


కర్నూల్ ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీల కుమ్ములాటలు తాడో పేడో తెలే స్థాయికి వచ్చాయని చెబుతున్నారు. అక్కడ పట్టుకోసం  భూమానాగిరెడ్డి కూతురు , మంత్రి అఖిల ప్రియ ఒకవైపు, భూమా అనుచరుడు ఎవి సుబ్బారెడ్డిమరొక వైపు పోటీపడుతున్నారు. ఈ పంచాయతీని తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారంనాడు వారితో సమావేశం ఏర్పాటుచేశారు. అయితే, రాజీ అసాధ్యమని వేరే చెప్పనవసరం లేదు.ఎందుకంటే, 25 సంవత్సరాలుగా ఆళ్లగడ్డ ను పరిపాలించిన కుటుంబం భూమాదే. ఇలాంటి కుటుంబంపాలనను కాపాడుకోవలసిన అవసరం అఖిల ప్రియ మీద ఉంది. ఇపుడు పట్టు సడలించుకుని, ఎవి సుబ్బారెడ్డికి పెత్తనం ఇస్తే, ఆళ్లగడ్డను వదులుకోవలసిందే. అది సాధ్యమా... ఆళ్లగడ్డ ఆకుటుంబానికి బంగారు గని లా పనిచేస్తుంది. నియోజకవర్గంమీద పట్టు ఉంటేనే అక్కడ రాబడి ఉంటుంది. నంద్యాల ఇక వాళ్ల చేతికిరాదు. ఉన్న ఆళ్లగడ్డను వదులుకుంటే అఖిలప్రియ ఏంచేయాలి?


2019 ఎన్నికల్లో ఎలాగైనా తానే అక్కడి నుంచి పోటీ చేయాలని ఎవి సుబ్బారెడ్డి బలాన్ని కూడ దీసుకుంటున్నారు. ఎంతయినామగవాడు కదా. ఇక అఖిల ఫ్రియ అనుభవ రాహిత్యం. మహిళగా, కుటుంబంలో మగ దిక్కు లేకపోవడం తో పలుకుబడిని పెంచుకోవడంలో చాలా పరిమితులుంటాయి. అదే ఇపుడామెకు అడ్డంకి గా తయారయింది. భూమా కూతరువునా కాదా అనేది కాదు ముఖ్యం, 2019లో ఎవరు గెలుస్తారనేదే చంద్రబాబుకు కావలసింది.  నయాన భయాన ఎన్నికల్లొ గెలవాలి. భయాన  ఆపని చేయగలశక్తి యుక్తి ఉన్నవాడు ఏవి సుబ్బారెడ్డి.దీనిని నిరూపించుకునేందుకు సుబ్బారెడ్డి రోజు  తెగు ఆరాటపడుతున్నారు. మొన్న, ఒక రోజు దీక్ష అనంతరం, నాయకులంతా తమ తమ వూర్లలో సైకిల్ యాత్ర చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అయితే, ఆయన సైకిల్ యాత్ర మీద ఆళ్లగడ్డలో రాళ్లు పడ్డాయి. ఇది అఖిల ప్రియ పనేనని సుబ్బారెడ్డి కంప్లయింట్. దీనిని ఆయన బాస్ దృష్టి కి తీసుకెళ్లారు.  ఆయన వర్గం మీద రాళ్లేయించాల్సిన ఖర్మనాకేం లేదు, తాను తల్లి తండ్రుల ఆశయం నెరవేర్చేందుకే కృషి చేస్తున్నానని అఖిల చెబుతున్నారు.  ఈ పంచాయతీని మొగ్గలోనే తెంచేందుకు ముఖ్యమంత్రి వారిరువురిని బుధవారం అమరావతికి రమ్మని పిలిచారు.
భూమా బతికున్నంతవరకు ఫీల్డోలో కధనడిపింది ఎవి సుబ్బారెడ్డే.  దీనితో అతినికి నియోజకవర్గంలో మంచి పట్టు వచ్చింది. భూమా చనిపోగానే, ఈ పలుకుబడి తో తానే ఎందుకు  నెంబర్ వన్ కాకూడదని కూడా అనుకున్నాడు. అంతే, ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటిదేదో జరుగుతుందని అఖిల వూహించింది. సుబ్బారెడ్డిని కట్ చేసేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఇదే ఇద్దరి మధ్య గొడవలకు కారణం.


ఈ గొడవలకు అభిప్రాయ భేదాలు కారణం కాదు.నియోజకవర్గం మీద పట్టు, పవర్, వసూళ్లు. కాబట్టి, చంద్రబాబు పంచాయతీలో తేలేదేముండదని టిడిపిలోని వర్గాలే గుసగుసలాడుతున్నాయి. 2019 నాటికి ఇద్దరిలో ఒకరే టిడిపిలో ఉంటారని, మరొకరు వైసిపిలో కి పోతారని కూడా చెబుతున్నారు.ఎవరుంటారో , ఎవరు పోతారో చూద్దాం.

click me!