ఎయిర్ టెల్ కష్టమర్లకు బంపర్ ఆఫర్

Published : Apr 06, 2018, 09:53 AM IST
ఎయిర్ టెల్ కష్టమర్లకు బంపర్ ఆఫర్

సారాంశం

ఫ్రీగా ఐపీఎల్ చూసే అవకాశం

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్.. తన కష్టమర్లకు భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్.. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కష్టమర్లకు వర్తిస్తుందని ఎయిర్ టెల్ తెలిపింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆ ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను ఉచితంగా చూసేందుకు వీలు క‌ల్పించింది. ఎయిర్‌టెల్ టీవీ యాప్‌ను క‌స్ట‌మ‌ర్లు ఫోన్ల‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే దాంట్లో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను లైవ్‌లో ఉచితంగా వీక్షించ‌వ‌చ్చ‌ని ఎయిర్‌టెల్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఎయిర్‌టెల్ టీవీ యాప్ ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ డివైస్‌ల‌కు అందుబాటులో ఉంది. 

ఐపీఎల్ సంద‌ర్భంగా ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లో ప్ర‌త్యేకంగా క్రికెట్ కోసం ఓ సెక్ష‌న్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఎయిర్‌టెల్ వినియోగ‌దారులు లైవ్ యాక్ష‌న్‌ను అస్స‌లు మిస్ అయ్యే అవ‌కాశం ఉండ‌దు. అలాగే వినియోగ‌దారులు త‌మ‌కు న‌చ్చిన ఐపీఎల్ టీంల‌ను ఫాలో అవుతూ ఆ టీం మ్యాచ్‌ల‌ను మిస్ కాకుండా చూడ‌వ‌చ్చు. అందుకు గాను నోటిఫికేష‌న్లు వ‌చ్చేలా ఎయిర్‌టెల్ టీవీ యాప్‌ను తీర్చిదిద్దారు. అలాగే లైవ్‌లో జ‌రిగే మ్యాచ్‌ల వివ‌రాల‌ను నోటిఫికేష‌న్ల రూపంలో పంప‌నున్నారు. ఈ ఫీచ‌ర్లు కావాలనుకుంటే ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్లు త‌మ ఎయిర్‌టెల్ టీవీ యాప్‌ను కొత్త వెర్ష‌న్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. ఈ యాప్‌ను ఇప్ప‌టికీ వాడ‌ని ఎయిర్‌టెల్ యూజ‌ర్లు త‌మ త‌మ డివైస్‌ల‌లో నూత‌నంగా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే దాంతో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లో ఉచితంగా వీక్షించ‌వ‌చ్చు. హాట్ స్టార్ సంస్థ‌తో భాగ‌స్వామ్యం అయిన ఎయిర్‌టెల్ ఈ స‌ద‌వకాశాన్ని త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తుంద‌ని ఆ సంస్థ కంటెంట్ అండ్ యాప్స్ సీఈవో స‌మీర్ బాత్రా వెల్ల‌డించారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu