ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్.. అంతా జియో మాయ

First Published 8, Jan 2018, 3:49 PM IST
Highlights
  • ఆఫర్లు ఇవ్వడంలో పోటీపడుతున్న ఎయిర్ టెల్, జియో
  • మరో ఆఫర్ ప్రకటించిన ఎయిర్ టెల్

ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్ టెల్, జియోలు పోటీపడుతున్నాయి. జియో ప్రకటిస్తున్న ఆఫర్లను తట్టుకునేందుకు ఎయిర్ టెల్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కస్టమర్లను ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తోంది. తాజాగా.. రూ.448, రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్ ల వ్యాలిడిటీని పొడిగించింది. ఇప్పటి వరకు రూ.448 ప్రీపెయిడ్ ప్లాన్.. ప్రతిరోజూ 1జీబీ డేటా(3జీ,4జీ), రోజుకి 250 నిమిషాల అన్ లిమిటెడ్ కాల్స్, మొత్తం 1000 నిమిషాలు అన్ లిమిటెడ్ కాల్స్.. 70రోజుల వ్యాలిడిటీ ఉండేది. కాగా.. ఇప్పుడు దానిని 82 రోజుల వ్యాలిడిటీకి పొడిగించింది.

అదేవిధంగా రూ.509 ప్లాన్ కి గతంలో 84 రోజుల వ్యాలిడిటీ ఉండేది. ఇప్పుడు దానిని 91 రోజుల వ్యాలిడిటీకి పొడిగించారు. ఈ ప్లాన్ లో రోజుకి 1జీబీ డేటా అదేవిధంగా రోజుకి 300 నిమిషాల అన్ లిమిటెడ్ కాల్స్.. మొత్తం 1200 నిమిషాల అన్ లిమిటెడ్ కాల్స్  84 రోజులకు వ్యాలిడిటీ ఉండేది. తాజాగా..జియో ప్రైమ్ సబ్ స్క్రైబర్స్ కి ‘‘హ్యాపీ న్యూ ఇయర్ 2018’’ ప్లాన్ ఆఫర్ చేసింది. అంతేకాకుండా పలు ప్లాన్ల ధరలను కూడా తగ్గించింది. దీంతో.. జియో పోటీని తట్టుకునేందుకు ఈ రకం ఆఫర్ ని ఎయిర్ టెల్ కస్టమర్ల ముందు ఉంచింది.

Last Updated 25, Mar 2018, 11:38 PM IST