
డ్రగ్స్ వ్యవహారం పట్టుకుని పూరీ జగన్నాథ్ మీద తెగరాస్తున్న మీడియా మీద నటుడు ప్రకాశ్ రాజ్ కూడా పెదవి విరిచారు.నిజం నిరూపణ కాలేదు, ఇంత సంచలనమా అని ఆయన కూడా ట్విట్టరెక్కి ఆశ్చర్య పోయారు. నిన్న రాత్రి , సిటి విచారణ పూర్తయి ఇంటికి పోయాక, తన ఆవేదన వెలిబుచ్చతూ ఒక వీడియోను పూరీ జగన్నాథ్ పోస్టు చేసిన సంగతి తెలిసిందే. దానికి స్పందిస్తూ ప్రకాశ్ రాజ్ కూడా తన అసంతృప్తిని ట్వీట్ చేశారు. పూర్తి వాస్తవం బయటికి రాకముందే మనమైనా, మీడియా అయినా ఒక విషయాన్ని సంచలంన చేయడం మంచిదికాదని గుర్తుంచుకోవాల్సిన సమయం వచ్చింది,’ అని చెప్పారు.