చంద్రబాబు మీద వైరల్ అయిన ఒక వీరాభిమాని పోస్టు...

First Published Feb 2, 2018, 12:05 PM IST
Highlights

చంద్రబాబు అంటే చాలా మందికి నచ్చదు, ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చాలా మంది వీరాభిమానులున్నారు. నిజానికి చంద్రబాబు, ఎన్టీఆర్ అంతటి ఆకర్షణ ఉన్న వాడు కాదు, అంతటి వాగ్ధాటి ఉన్నవాడు కాదు. చాలా చిన్న కుటుంబ నేపథ్యం ఉన్నవాడు. ఆయనకున్నదంతా సొంత రాజకీయ నేపథ్యమే. రాజకీయాల ద్వారా వీరాభిమానులను సమకూర్చుకోవడం చాలా కష్టం. అయితే, చంద్రబాబు ఈ విషయంలో విజయవంతమయ్యారు. దానికి కారణం, సింపుల్ ఆయన కష్టజీవి అని పేరు తెచ్చుకున్నారు. జీవితంలో డిసిప్లిన్, వ్యవహారాలలో సింప్లిసిటి, పగలనక,రేయనక, వాననక, ఎండనక తిరడగం, కష్టపడటం... ఇదే ఆయనకు అభిమానుల్ని సమీకరించి పెట్టింది. అందులో ఒక అభిమాని  ఆయన గురించి రాసిన అద్భతమయిన పోస్టొకటి సోషల్ మిడియాలో హల్చల్ చేస్తూ ఉంది. చంద్రబాబు అంటే చాలా మందికి నచ్చదు, అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాడు. ఆయన పోస్టు లో లాజిక్ చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో అది వైరలయిపోయింది.  మీ కోసం యధాతధంగా  ఈ పోస్టును అందిస్తున్నాం.

 

 **చంద్రబాబు అభివృద్ధి చెందితే ప్రధాని పదవికి పోటీ వస్తాడని మోదీకి భయం

 

**ఆంధ్రా అభివృద్ధి చెందితే గుజరాత్ కు పోటీ వస్తుందని అమిత్ షా కి భయం

 

**అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్ ఖాళీ అవుతుందని కేసీఆర్ కు భయం

 

**పోలవరం పూర్తయితే తన ఉనికికే ప్రమాదమని జగన్ కి  భయం

 

**విశాఖ కు రైల్వే జోన్ వస్తే తమ ఆదాయం పోతుందని ఒడిస్సాకు భయం

 

**ఆంధ్రా పారిశ్రామికం గా వృద్ది చెందితే పెట్టుబడులు రావని తమిళనాడుకు భయం

 

**ఆంధ్రా ఐ టి రంగం లో వృద్ది చెందితే తమకు పోటీ వస్తుందని కర్నాటకకు భయం

 

**తెలుగుదేశం పాతుకుపోతే మళ్ళీ తనకు ఛాన్స్ రాదేమోనని పవన్ కు భయం

 

**చంద్రబాబు ద్వారా తృతీయ ఫ్రంట్ ఏర్పడితే తమ పరిస్థితి ఏమిటని రాహుల్ గాంధీకి భయం

 

**భయం. భయం.. భయం… చంద్రబాబంటే అందరికీ భయమే

 

**కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకూ ఒక భయముందీ…

 

**అది 2019లో చంద్రబాబు రాకుంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోతుందేమోనని… అరాచకపుశక్తులు విజృంభిస్తాయేమోనని

 

 

click me!