
జనవరి 1వ తేదీన పుట్టబోయే ఆడపిల్లలు నిజంగా అదృష్టవంతులే. పుట్టి పుట్టగానే.. రూ.5లక్షలను వారి ఖాతాలో వేసేసుకుంటున్నారు. నమ్మసక్యంగా లేదా.. మీరు చదవింది నిజమే. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కాదులేండి. మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరంలోని ప్రభుత్వం ఆస్పత్రిలో జనవరి 1వ తేదీన పుట్టిన ఆడ పిల్లలకు రూ.5లక్షలను బహుమతిగా ఇస్తామని బీబీఎంపీ( బృహత్ బెంగళూరు మహానగర పాలిక్) ప్రకటించింది. అది కూడా నార్మల్ డెలవరీ ద్వారా పుడితే మాత్రమే ఇస్తామని చెప్పారు. పాప పుట్టిన వెంటనే.. తమకు సమాచారం తెలియజేస్తే.. పాప పేరుమీద రూ.5లక్షల నగదు డిపాజిట్ చేస్తామని బీబీఎంపీ మేయర్ సంపత్ రాజ్ తెలిపారు. ఆ నగదుకి వచ్చే వడ్డీ ఆ పాప చదువుకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఆ నగదు అందుకోబోయే ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులే కదా. కాకపోతే ఇక్కడ అందరికీ మరో సందేహం తలెత్తుతోంది. ఒకే కాన్పులో ఇద్దరో, ముగ్గురో ఆడపిల్లలు పుడితే.. వారందరికీ తలా రూ.5లక్షలు ఇస్తారా లేదా.. ఒక కాన్పుకి రూ.5లక్షలు ఇస్తారా?