ఫోన్ నెంబర్ల మార్పిడిలో మరో షాకింగ్ న్యూస్

First Published Feb 22, 2018, 10:57 AM IST
Highlights
  • ఫోన్ నెంబర్ల మార్పిడిపై క్లారిటీ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్

ఫోన్ నెంబర్ల విషంయలో భద్రత పెంచేందుకు 10 అంకెల ఫోన్ నెంబర్ ని 13 అంకెలకు పెంచుతున్నట్లు వార్తలు వెలువడిన సంగతి అందరికీ తెలిసిందే.  జులై1వ తేదీ నుంచి ఎవరు కొత్త సిమ్ తీసుకున్నా.. వారి ఫోన్ నెంబర్ కి 13 నెంబర్లు ఉంటాయని, ఆల్రెడీ వినియోగంలో ఉన్న ఫోన్ నెంబర్లకు అక్టోబర్ నుంచి అదనంగా 3 అంకెలు చేరతాయనేది ఆ వార్త సారాంశం. ఈ వార్త దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే.. దీని గురించి మరో ఆసక్తికర విషయం బయటపడింది.

 ఈ ఫోన్ నెంబర్ లో అంకెల పెంపు విషయంపై బీఎస్ఎన్ఎల్ స్పందించింది. మొబైల్ నంబర్లలో 10 అంకెలు కాకుండా 13 అంకెలు ఉండేలా మార్పులు చేయనున్న వార్త నిజమే అయినా అది రెగ్యులర్ మొబైల్ వినియోగదారులకు వర్తించదని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. రెగ్యులర్ వినియోగదారుల ఫోన్ నంబర్లలో 10 అంకెలు మాత్రమే ఉంటాయని, కాకపోతే మెషిన్ టు మెషిన్ పరికరాల్లోనే ఈ మార్పు చేస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ ద్వారా తెలియజేసింది. 

click me!