టీడీపీ నేతల వీరంగం..జగ్గయ్యపేటలో ఉద్రిక్తత

Published : Oct 27, 2017, 12:57 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
టీడీపీ నేతల వీరంగం..జగ్గయ్యపేటలో ఉద్రిక్తత

సారాంశం

జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక అడ్డుకున్న టీడీపీ ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలు 144 సెక్షన్ విధించిన పోలీసులు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.  టీడీపీ నేతలు మున్సిపల్ ఆఫీస్ వద్ద  విధ్వంసం సృష్టించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి 144 సెక్షన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అసలేం జరిగిందంటే.. శుక్రవారం జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. కాగా.. మొత్తం 27మంది కౌన్సిలర్లు ఉండగా.. వారిలో 16 మంది వైసీపీ, 10మంది టీడీపీ, ఒక ఇండి పెండెంట్ అభ్యర్థి ఉన్నారు. వైసీపీకి మెజార్టీ ఎక్కువగా ఉండటంతో మొదట వైసీపీ కౌన్సిలర్లను కొనడానికి యత్నించారు. అది కుదురకపోవడంతో ఛైర్మన్ ఎన్నికను అడ్డుకునే యత్నం చేశారు.

మున్సిపల్ కార్యాలయానికి తమ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు రాలేదని.. వారు వచ్చే వరకు ఎన్నిక జరగడానికి వీలు లేదంటూ టీడీపీ కౌన్సిలర్లు అడ్డుకునేందుకు యత్నించారు.  అయినప్పటికీ.. ఎన్నిక  ప్రక్రియ మొదలు పెట్టేసరికి టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. తమ పార్టీ కౌన్సిలర్లు ఇద్దరిని వైసీపీ కిడ్నాప్ చేసిందంటూ హైడ్రామా మొదలుపెట్టారు.

దీంతో వివాదం చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపుచేసేందుకు అధికారులు మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేయగా.. టీడీపీ కార్యకర్తలు వాటిని ధ్వంసం చేశారు. కార్యాలయం ముందు కొందరు కార్యకర్తలు ఓ ద్విచక్ర వాహనాన్ని తగలపెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ విధించారు.

ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యలతో కలిసి కౌన్సిలర్లు ఈ ఆందోళనకు దిగారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !