ఈ ఏడాది ఫేస్ బుక్ హాట్ టాపిక్స్ ఇవే..

First Published Dec 13, 2017, 5:07 PM IST
Highlights
  • ఈ ఏడాది ఫేస్ బుక్ లో నెటిజన్లు చర్చించుకున్న హాట్ టాపిక్స్  ఇవే

2017 చివరి అంకానికి చేరుకుంది. మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా 2017వ సంవత్సరాన్ని ప్రముఖ సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్ ఫేస్ బుక్ రివ్యూ చేసింది. ఈ ఏడాది ఫేస్ బుక్ లో నెటిజన్లు చర్చించుకున్న హాట్ టాపిక్స్ ఎంటో చూద్దామా..

1.బాహుబలి( ది కన్ క్లూజన్)..

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.. అనే ప్రశ్నకు సమాధానం ఈ సినిమాలోనే లభించింది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చేరవేసింది.

2.జలికట్టు..

తమిళుల సంప్రదాయ ఆట జల్లికట్టు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో దీనిని ఆడతారు. అయితే..దీనివల్ల జంతువులకు హాని కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కానీ తమిళులంతా ఒకే తాటిపై నిలిచి తమ సంప్రదాయ ఆటను తిరిగి గెలుచుకున్నారు.

3.ఇండియా వర్సెస్ పాకిస్థాన్ ( ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ)..

ఇండియా, పాకిస్థాన్ కి మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచం మొత్తానికీ ఆసక్తే. అలాంటిది ఇండియాలో ఇంకెంత హాట్ టాపిక్ అవ్వాలి. అందుకే ఈ ఏడాది ఫేస్ బుక్ లో ఎక్కువగా చర్చించిన వాటిలో ఇది కూడా ఉంది.

4.సూపర్ ఫాస్ట్ ట్రైన్..

దేశంలో కొత్తగా ప్రవేశపెట్టే రైళ్ల వివరాలను కేంద్ర రైల్వే శాఖ ఈ ఏడాది ప్రకటించింది. దీంతో ఈ రైళ్ల విషయాలపై నెటిజన్లు బాగానే చర్చలు జరిపారు. వారి విలువైన పాయింట్స్ ని కూడా తెలియజేశారు.

5.వినోద్ ఖన్నా..

బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ ఏడాది లెజెండరీ నటుడు, నిర్మాత వినోద్ ఖన్నాని కోల్పోయింది. ఈయన గురించి కూడా నెటిజన్లు ఫేస్ బుక్ లో బాగా చర్చించారు.

6. చెస్టర్ బెన్నింగ్టన్..

ప్రముఖ సింగర్ చెస్టర్ బెన్నింగ్టన్  ఈ ఏడాది  జులై 20వ తేదీన కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు 8మిలియన్ల మంది ఫేస్ బుక్ లో పోస్టులు చేశారు.

7.జై లవ కుశ..

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జై లవ కుశ. తెలుగు సినీ ఇండస్ట్రీలో బిగ్ హిట్ గా నిలిచిన ఈ సినిమా గురించి అభిమానులు ఫేస్ బుక్ లో బాగా చర్చించారు.

8. యోగి ఆదిత్యనాథ్...

యోగి ఆదిత్యనాథ్ ఈ సంవత్సరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన సీఎం పదవిని అలంకరించడాన్ని స్వాగతిస్తూ.. చాలా మంది ఫేస్ బుక్ లో పోస్టులు చేశారు.

9. మిస్ వరల్డ్ కిరీటం..

17ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ కిరీటం.. ఈ ఏడాది భారత్ కి దక్కింది. భారతీయ యువతి మానుషి చిల్లర్.. మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ విషయం.. ఫేస్ బుక్ హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన న్యూస్, ఫోటోలు నెట్టింట హల్ చల్ చేశాయి.

10. గోరఖ్ పూర్ ట్రాజడీ..

ఈ ఏడాది అంత్యంత దురదృష్టకర సంఘటన ఇది. ఉత్తరప్రదేశ్ లోని ఘోరఖ్ పూర్ లోని ఓ ఆస్పత్రిలో చాలా మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. భారతీయులందరినీ కలచి వేసిన సంఘటన ఇది.

click me!