ఉద్యోగులకు భారీగా పెరిగనున్న వేతనాలు

First Published Apr 9, 2018, 9:54 AM IST
Highlights
ఎన్నికలకు ముందే పెంచాలని నిర్ణయం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఏడో వేతన సవరణ సంఘం చేసిన సిఫార్సుల్ని మించిన వేతనాలను ఉద్యోగులకు ఇవ్వాలనీ, ఇది 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే పూర్తికావాలనీ నరేంద్రమోదీ సర్కారు భావిస్తోంది. అయితే కనీస వేతనాన్ని పెంచడానికి మాత్రం ప్రభుత్వం సిద్ధంగా లేదు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పి.రాధాకృష్ణన్‌ కూడా ఇటీవల రాజ్యసభలో ఈ విషయం తెలిపారు. కేంద్ర ఉద్యోగుల జీతాలు 2016 జూన్‌లో పెరిగాయి. అంతకు ముందు కనీస వేతనం నెలకు రూ.7000 కాగా, సవరణతో అది రూ.18,000కి పెరిగింది. దీనిని రూ.26,000కి పెంచాలనీ, ‘ఫిట్‌మెంట్‌’ను 2.57 రెట్ల నుంచి 3.68 రెట్లకు పెంచాలనీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తమ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచినట్లుగానే కేంద్రం కూడా పెంచవచ్చని తెలుస్తోంది.
 

click me!