
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఈ నెల 2వ తేదీన చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఓ యువతి పేరు పెట్టి ఓ విజ్ఞప్తి చేసింది. భోపాల్‌కు చెందిన అంకితా.. నీ మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు ఫుడ్ ఆర్డర్ పెట్టడం ఆపేయాలి అని ట్విట్టర్ వేదికగా కోరింది. ఆ విజ్ఞప్తి నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నది. చాలా మంది ఆ ట్వీట్‌కు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
ఆ అంకితా తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు ఫుడ్ ఆర్డర్ పెడుతున్నదని, అయితే, డబ్బులు ఆమె చెల్లించడం లేదని జొమాటో తెలిపింది. ఆ ఆర్డర్ పేమెంట్ కోసం క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుంటున్నదని, తీరా ఆర్డర్‌ను తీసుకెళ్లిన తర్వాత ఆయన తిరస్కరిస్తున్నాడని జొమాటో వివరించింది. ఆయన మూడు సార్లు ఆ ఆర్డర్‌కు డబ్బులు చెల్లించేందుకు నిరాకరించాడని తెలిపింది.
ఈ ట్వీట్‌ను పది లక్షల మంది చూశారు. సుమారు వేయి మంది రీట్వీట్ చేశారు. చాలా మంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Andhra Pradesh: చిన్ని కుటుంబం చెరిగిపోయింది.. భార్య, పిల్లలను చంపేసి భర్త సూసైడ్
అయితే, జొమాటో ఆ విషయాన్ని అంతటితో ముగించలేదు. మరో ట్వీట్ చేసింది. కామెడీగా మరో ట్వీట్ చేసింది. ‘అంకితా అకౌంట్ పై క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ రద్దు చేశామని ఎవరైనా ఆమెకు చెబుతారా? 15 నిమిషాల నుంచి ఆమె ఆర్డర్ పెట్టడానికి ట్రై చేస్తున్నది’ అంటే మరో ట్వీట్ చేసింది.