జొమాటో నుంచి ఆ రెస్టారెంట్లు ఔట్

Published : Feb 23, 2019, 03:42 PM IST
జొమాటో నుంచి ఆ రెస్టారెంట్లు ఔట్

సారాంశం

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జోమాటో గురించి తెలియని వారు ఉండరు. ఎప్పటికప్పుడు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ.. ఫుడ్ అందజేస్తూ ఉంటుంది. 

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జోమాటో గురించి తెలియని వారు ఉండరు. ఎప్పటికప్పుడు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ.. ఫుడ్ అందజేస్తూ ఉంటుంది. కాగా.. తాజాగా జొమాటో సంస్థ ఓ నిర్ణయం తీసుకుంది. జొమాటో సంస్థ ఫిబ్రవరిలో దాదాపు 5వేల రెస్టారెంట్లను తమ జాబితా నుంచి తొలగించింది. ఈ విషయాన్ని జొమాటో అధికారికంగా వెల్లడించింది.

ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను సరిగా అందించడం లేదనే కారణంతో ఆ రెస్టారెంట్లను తన జాబితా నుంచి తొలగించినట్లు జొమాటో వెల్లడించింది. పుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలను పూర్తిగా అమలు చేస్తామని తెలిపింది.

దేశంలోని  150పట్టణాల్లో తమతో ఒప్పందం చేసుకున్న సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేస్తామని వెల్లడించింది. ఈ విషయంపై జొమాటో సీఈవో మోహిత్ గుప్తా మాట్లాడుతూ.. నిత్యం తమ జాబితాలోకొ కొత్తగా 400 రెస్టారెంట్లు వచ్చి చేరుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడం చాలా కీలకమని ఆయన అన్నారు. తమతో అనుబంధం ఉన్న దాదాపు 80వేల రెస్టారెంట్లను మరోసారి పరిశీలించాలని అనుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే కొన్ని రెస్టారెంట్లను జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

డాలర్లు వస్తాయి కానీ... అమెరికాలో అందరి బతుకూ ఇదే! | US vs India Minimum Wage | Asianet News Telugu
తమిళనాడు బడ్జెట్ విజయ్ ఆసక్తికర కేటాయింపులు | Tamil Nadu CM Vijay Mega Budget 2026