గడ్డి, బురదతో నిర్మించిన కార్యాలయం.. బిలియనీర్ సీఈవో మెచ్చిన ఆఫీసు ఇదీ.. ఫొటోలు వైరల్

Published : Apr 22, 2022, 01:32 PM ISTUpdated : Apr 22, 2022, 01:47 PM IST
గడ్డి, బురదతో నిర్మించిన కార్యాలయం.. బిలియనీర్ సీఈవో మెచ్చిన ఆఫీసు ఇదీ.. ఫొటోలు వైరల్

సారాంశం

బిలియనీర్ సీఈవో శ్రీధర్ వెంబూ వినూత్న రీతిలో తన కార్యాలయాన్ని డిజైన్ చేసుకున్నారు. గడ్డి, కర్రలతో వేసిన పైకప్పు, బురద, సున్నపురాయితో కట్టిన గోడలు, వాటిపై భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా డిజైన్లు వేయించి తన ఆఫీసును రెడీ చేసుకున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.  

న్యూఢిల్లీ: ఆఫీసు అనగానే అందరికీ అద్దాల గోడలు, వైట్ క్యాబిన్లు, టాస్క్ చైర్లు, అంతా తళతళ మెరుస్తూ ఉండే వాతావరణం కనిపిస్తుంది. అలా ఉంటేనే ఆఫీసు అనే స్థాయికి చేరింది ఈ వ్యవహారం. కానీ, కొందరు ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తారు. వారి మస్తిష్కాన్నే కాదు.. వారి చుట్టుపక్కల ఉండే పరిసరాలను అంతే సృజనాత్మకంగా, అంతే వినూత్నంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి వ్యక్తే బిలియనీర్ సీఈవో శ్రీదర్ వెంబూ. ఆయన తన ఆఫీసును సాంప్రదాయకంగా కనిపించే ఈ అద్దాల తళతళల్లా కాకుండా పర్యావరణ హిత మార్గాన్ని ఎంచుకున్నాడు.

గడ్డి, కర్రలతో పై కప్పు.. బురదతో కట్టిన గోడలు, సున్నపురాయితో అద్దిన గోడలు, కలపతో చేసిన కుర్చీలు, సోఫాలు, టేబుళ్లు అన్ని పర్యావరణ హితంగా, భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఆయన తన కార్యాలయాన్ని డిజైన్ చేసుకున్నారు. ఆయన మొత్తంగా ఆఫీసు ఇలానే ఉండాల్సిన అవసరం లేదని, మనసుకు నచ్చినట్టుగా, ప్రశాంత వాతావరణం ఉండేలా కూడా మార్పులు చేసుకోవచ్చని స్పష్టంగా చెప్పారు. తన ఆఫీసుకు చెందిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

 

గ్రామీణ భారతంలో కనిపించే పూరి గుడిసెల శైలిలో ఈ ఆఫీసు నిర్మాణం ఉన్నది. పైన ఫ్లోర్కూడా నిర్మించారు. తాటి మట్టలు, గడ్డి, కర్రలతో పై కప్పు నిర్మించారు. మట్టి గోడలు, సున్నపు రాయి అద్ది వాటిపై ప్రధానంగా నీలం, పసుపు రంగులు వేశారు. ఆ గోడలపై భారతీయ పురాతన సంస్కృతి ఉట్టిపడేలా డిజైన్లు వేశారు. పైన ఫ్లోర్‌లో సగం మేరకు గోడలు నిర్మించి మిగతాదంతా ఓపెన్‌గా వదిలిపెట్టారు. ఆ పైన పైకప్పు వేశారు. పైన ఫ్లోర్ తన కాన్ఫరెన్స్ రూమ్ అంటూ శ్రీధర్ వేంబు పోస్టు చేశారు. ఆ గదిలో ఉన్నవన్నీ కలపతో చేసిన ఫర్నీచరే. ఎలాంటి ప్రాసెస్‌డ్ మెటీరియల్ లేకుండా సహజంగా ప్రకృతిలో లభించే మెటీరియల్‌తో ఈ ఆఫీసు నిర్మాణం జరిగింది.

కొత్త కాన్ఫరెన్స్ గది, చిన్ని కార్యాలయం అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎండకాలంలోనూ చల్లగా కంఫర్టబుల్‌గా ఉండే ఈ ఆఫీసు అంటే తనకు ఇష్టం అంటూ రాసుకొచ్చారు.

కాగా నెటిజన్లు ఈ ఫొటోలపై ప్రశంసలు కురిపించారు. ఆఫీసు గదులు ఇలాగే ఉండాలని, ఇప్పుడు సాంప్రదాయికంగా కనిపించే ఆ కృత్రిమ గదులు ఇబ్బందిగా ఉంటున్నాయని పేర్కొంటున్నారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?