వైఎస్ షర్మిల రెడ్డి : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

By Rajesh Karampoori  |  First Published Mar 13, 2024, 1:59 PM IST

YS Sharmila Biography: వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా, జగన్న వదిలిన బాణంగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు వైఎస్ షర్మిల. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించిన షర్మిల.. తన సోదరుడు జగన్‌తో తనకు రాజకీయ విభేదాలు ఉన్నాయని , తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీ పార్టీని ప్రారంభించింది. కానీ ఇటీవల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరింది.  ఓ సారి వైఎస్ షర్మిల రెడ్డి బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, రాజకీయ జీవితం, తదితర విశేషాలు మీకోసం ..


YS Sharmila Biography:

వైఎస్ షర్మిల రెడ్డి బాల్యం,  విద్యాభ్యాసం

Latest Videos

వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా పరిచయమైన తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకుంది వైఎస్ షర్మిల.1973 డిసెంబర్ 17న వైయస్ రాజశేఖర్ రెడ్డి- విజయమ్మ దంపతులకు పులివెందులలో జన్మించారు షర్మిల. తొలుత ఆమె విద్యాభ్యాసం పులివెందులలో సాగింది. కానీ, ఆ తరువాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. ఈ స్కూల్లోనే ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆ తరువాత చెన్నైలో ఎంబీఏ పూర్తి చేసింది.

షర్మిల వివాహ విషయానికి వస్తే.. ఒకరోజు హైదరాబాద్ శివారులోని ఓ హోటల్ లో షర్మిల, మొరుసుపల్లి అనిల్ కుమార్ ను కలిసింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే.. వైయస్సార్ మాత్రం వారి ప్రేమను తొలుత ఒప్పుకోలేదు. కానీ, కూతురి మీద ప్రేమతో ఆమె పత్తానికి తండ్రి మనసు కరిగిపోయింది. ఎవరికి తెలియకుండా అనిల్ గురించి పూర్తి వివరాలు సేకరించి. పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు వైఎస్ఆర్. అలా షర్మిల మొరుసుపల్లి అనిల్ కుమార్ ని 1995లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనిల్ కుమార్ తెలంగాణలోని సనాతన హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అయితే పలు కారణాలతో ఆయన క్రైస్తవ మతంలోకి మారారు.అనిల్ తన సంస్థ వరల్డ్ ఎవాంజెలిజం ద్వారా మత బోధనలు చేస్తారు. షర్మిల అనిల్ దంపతులకు ఇద్దరు పిల్లలు. పాప అంజలి. బాపు రాజారెడ్డి. ఇటీవల రాజారెడ్డి వివాహం జరిగింది.

రాజకీయ జీవితం 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిల తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. షర్మిలకు వైయస్సార్ గారితో చనువెక్కువ. వైయస్సార్ మరణాన్ని తట్టుకోలేకపోయింది. కానీ, అదే సమయంలో వైఎస్ మరణవార్తతో గుండెపోటుతో మరణించిన అభిమానుల్ని పరామర్శించి వాళ్ళని ఓదార్చారు షర్మిలా. ఇలా 2012 నుంచి ఆమె ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఏంట్రీ ఇచ్చింది. 

ఒంటరిగా ఉన్న అన్నకు సపోర్ట్ గా నిలిచింది షర్మిల. అన్న జైలు పాలు కావడంతో షర్మిల తన తల్లి వైఎస్‌ విజయమ్మతో కలిసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) తరపున ప్రచారం బాధ్యతలు చేపట్టారు. ఈ తరుణంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్పూర్తితో షర్మిల 18 అక్టోబర్ 2012న కడప జిల్లాలోని ఇడుపులపాయల నుంచి పాదయాత్ర ప్రారంభించింది.  పాదయాత్రలో భాగంగా ఆమె 14 జిల్లాల్లో పర్యటించింది. దాదాపు 3,000 కి.మీ పాదయాత్రను 4 ఆగస్టు 2013న ఇచ్ఛాపురంలో ముగించింది. వైసీపీ కష్టకాలంలో పార్టీ అండగా నిలించింది వైఎస్ షర్మిల.  అనంతరం జరిగిన ఉపఎన్నికల్లో  18 అసెంబ్లీ స్థానాలకు గాను 15 స్థానాలు, 1 పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్‌సీపీ 1 గెలుచుకుంది. 

2014లో జగన్ గారు గెలవకపోయినా మళ్లీ 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు  అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సవాల్ చేస్తూ.. “బై బై బాబు” పేరిట  ఆంధ్రప్రదేశ్ అంతటా 11 రోజుల పాటు 15 వేల కిలోమీటర్లు బస్సు యాత్రను చేపట్టారు . అలాగే.. మరో  “ప్రజా తీర్పు - బై బై బాబు” పేరుతో మరోసారి పాదయాత్రను చేపట్టింది. 1,553 కిమీ పాదయాత్రలో 39 బహిరంగ సభలను నిర్వహించింది.ఇలా వైఎస్ జగన్ విజయంలో కీలకపాత్ర పోషించారు షర్మిల. 

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ 

ఏపీలో వైసీపీ విజయంలో కీలకపాత్ర పోషించిన షర్మిల.. ఏమైందో తెలియదు కానీ .. ఫిబ్రవరి 2021లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడైన తన సోదరుడు జగన్‌తో తనకు రాజకీయ విభేదాలు ఉన్నాయని , తెలంగాణ రాష్ట్రంలో 8 జూలై 2021న వైఎస్ఆర్టీపీ ప్రారంభించింది.  ఆ సమయంలో అధికారంలో ఉన్న  భారత రాష్ట్ర సమితి  (BRS) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రారంభించింది.

నవంబర్ 2023లో వైఎస్ షర్మిల తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పాల్గొనబోమని ప్రకటించారు.  కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎన్నికల సామర్థ్యాన్ని గుర్తించి, కాంగ్రెస్‌ను అణగదొక్కడం కాదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ విధానాలను విజయవంతంగా అమలు చేసేలా హామీ ఇవ్వడమే తమ లక్ష్యమని నొక్కి చెప్పారు. ఆ తరువాత 4 జనవరి 2024న ఆమె తన వైయస్ఆర్ తెలంగాణ పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

కాంగ్రెస్ లో చేరిక 

4 జనవరి 2024న INCలో YSRTP విలీనం చేసింది. అదే రోజు AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో న్యూఢిల్లీలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తరువాత 2024 జనవరి 16న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిల నియమితులయ్యారు.

 

షర్మిల రెడ్డి బయో

పూర్తి పేరు: యెదుగూరి సందింటి షర్మిల రెడ్డి  
పుట్టిన తేది: 17 డిసెంబర్ 1973 
తండ్రి పేరు: వైఎస్ రాజశేఖర్ రెడ్డి
తల్లిపేరు: విజయమ్మ 
వయస్సు: 51 సంవత్సరాలు
జన్మస్థలం: పులివెందుల, కడప, ఆంధ్రప్రదేశ్
వృత్తి: రాజకీయ నాయకురాలు
రాజకీయ పార్టీ: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (2024
జాతీయత: భారతీయుడు
స్వస్థలం: పులివెందుల, కడప, ఆంధ్రప్రదేశ్
మతం: క్రైస్తవ మతం

click me!