Pawan Kalyan Biography: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిశ్రమలో అడుగు పెట్టి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. వరుసగా సినిమాలు ఫెయిల్ అయినా అభిమానులు మాత్రం ఆయనను వదిలి వెళ్ళలేదు. అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన. ఆ పార్టీని తర్వాత కాంగ్రెస్ లో కలపడంతో నచ్చక అన్నతో విభేదించాడు. తర్వాత తానే స్వంతంగా జనసేన పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగాడు. అటు సినిమాలోనూ.. ఇటు రాజకీయాలలో రాణిస్తున్న సినీనటుడు, నిర్మాత, రచయిత, రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుందాం.
Pawan Kalyan Biography: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిశ్రమలో అడుగు పెట్టి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. వరుసగా సినిమాలు ఫెయిల్ అయినా అభిమానులు మాత్రం ఆయనను వదిలి వెళ్ళలేదు. అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన. ఆ పార్టీని తర్వాత కాంగ్రెస్ లో కలపడంతో నచ్చక అన్నతో విభేదించాడు. తర్వాత తానే స్వంతంగా జనసేన పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగాడు. అటు సినిమాలోనూ.. ఇటు రాజకీయాలలో రాణిస్తున్న సినీనటుడు, నిర్మాత, రచయిత, రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుందాం.
బాల్యం, విద్యాభ్యాసం
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో సెప్టెంబర్ 2, 1971న వెంకటరావు-అంజనాదేవి దంపతులకు జన్మించాడు పవన్ కళ్యాణ్ . మెగాసార్ట్ చిరంజీవి పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య. పవన్ ప్రాథమిక విద్యభ్యాసం బాపట్లనే సాగింది . తర్వాత నెల్లూరులో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఇంటర్ నెల్లూరులోని విఆర్ కాలేజీలో చదువుకున్నాడు. ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశాడు.
సినీ జీవితం
కంప్యూటర్ డిప్లమా పూర్తి చేసిన ఉద్యోగం చేయాలని ఉద్దేశం మాత్రం ఆయన ఏ మాత్రం లేదు. ఆయనకు పుస్తకాలు చదువడమంటే చాలా ఇష్టం. అప్పటికే చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడంతో సినిమాల్లోకి వెళ్లాలని ఆలోచన వచ్చింది పవన్ కళ్యాణ్. ఆ విషయాన్నే తన అన్నయ్య చిరంజీవికి చెప్పారు. సరే నువ్వు నటించు కానీ ముందు యాక్టింగ్ అని.. సత్యం మాస్టార్ దగ్గరికి పవన్ కళ్యాణ్ ని పంపించాడు. ఆయన దగ్గర ఆరు నెలలు నటన నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈలోగా చిరంజీవి .. తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కథని డైరెక్టర్స్ ని వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలో వీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కథను ఒకే చేసి.. 1996 జనవరిలో షూటింగ్ మొదలు పెట్టారు.ఈ సినిమా 1996 అక్టోబర్ నెలలో విడుదల చేశారు. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. అయితే.. ప్రేక్షకులు మాత్రం కేవలం చిరంజీవి తమ్ముడైన మాత్రమే సినిమా ధియేటర్ కి వచ్చారు.
ఆ తరువాత పవన్ కళ్యాణ్ కోసం గోకులంలో సీత అనే కథను సిద్ధం చేశారు. వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అంటే 1997 మే నెలలో వైజాగ్ కి చెందిన నందిని అనే అమ్మాయితో పవన్ కళ్యాణ్ కి వివాహం జరిపించారు. వీరిద్దరి వివాహం అయ్యాక గోకులంలో సీత 1997 ఆగస్టులో విడుదల చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సుస్వాగతం మొదలైంది. ఈ సినిమా మొదలయ్యే నాటికి పవన్ నందిని లిద్దరు వేరువేరు అయిపోయారు. సుస్వాగతం ,ఆ తరువాత వచ్చిన తొలిప్రేమ సినిమాలు బస్టర్ హీట్ అయింది. సుస్వాగతంతో పవన్ కళ్యాణ్ కి ఒక గుర్తింపు వస్తే .. తొలిప్రేమతో స్టార్ హోదా తెచ్చింది. నిజంగా తొలిప్రేమ పవన్ సినీ జీవితంలో మైల్ స్టోన్. ఈ సినిమా ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డు, అలాగే.. మరో నాలుగు నంది అవార్డ్స్ కూడా ఈ సినిమా గెలుచుకుంది.
1999లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు మరో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో పవన్ క్రేజ్ మరికొంత పెరిగింది. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బద్రి వచ్చింది. ఇలా తనదైన నటనతో అభిమానులలో ‘పవర్ స్టార్’ గా ప్రసిద్ధి చెందాడు. ఈ సినిమా సమయంలోనే రేణు దేశాయ్ తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఇద్దరు ప్రేమలో ఉంటూనే సహజీవనం చేయడం ప్రారంభించారు. అప్పట్లో ఈ విషయం గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది.
ఇదిలా ఉంటే.. ఎస్ జె సూర్య దర్శకత్వంలో 2001 ఏప్రిల్ లో ఖుషి వచ్చింది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టవడమే కాదు ఆ సంవత్సరం ఇండస్ట్రీకి కూడా ఆ సినిమానే అయింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతంపెరిగింది.ఈ సినిమా 101 కేంద్రాల్లో 50 రోజులు.. 79 కేంద్రాల్లో వంద రోజులు.. ఎనిమిది కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఈ సినిమా తరువాత పవన్ ఓ ప్రయోగానికి తెర తీశాడు. తనే తనకోసం ఒక కథని సిద్ధం చేసుకుని రేణుదేశాన్ని హీరోయిన్ గా పెట్టి జానీ అనే సినిమాని మొదలు పెట్టాడు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా.. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించాడు. కానీ, జానీ అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది.
2004లో వీరశంకర్ బైరిశెట్టి దర్శకత్వంలో గుడుంబా శంకర్ మొదలైంది ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కి రేణు దేశాయ్ లకు కొడుకు అకీరానందన్ జన్మించాడు. 2004 సెప్టెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా కూడా అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది. ఇక 2005లో వచ్చిన బాలు 2006 లో వచ్చిన బంగారం , అన్నవరం కూడా అభిమానులు పెద్దగా తృప్తి పరచలేదు. అదే సమయంలో శంకర దాదా ఎంబిబిఎస్ లో ఒక అతిధి పాత్రలో నటించి మెగా అభిమానుల్ని అలరించాడు.
శంకర్ దాదా ఎంబిబిఎస్ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రావడం అదే సమయంలో పవన్ మొదటి భార్య అంజలి పవన్ పై రేణు దేశాయ్ పై కేసు వేయడం కాస్తా ఇరాకటంలో పడ్డారు. ఈ సమయంలో మెగాస్టార్ కలుగ చేసుకుని తన రాజకీయ, సినీ జీవితంలో మచ్చలు మిగిలిపోకూడదని, ఐదు కోట్లతో ఆ వివాదాన్ని సెటిల్మెంట్ చేసుకున్నారు. దాంతో నందిని అన్ని కేసులను ఉపసంహరించుకుంది. 2008 ఆగస్టు 12న పవన్ కళ్యాణ్ కి నందిని విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో జల్సా సినిమా విడుదలైంది.కానీ అభిమానుల పూర్తి ఆకలిని తీర్చలేకపోయినా కొంతవరకు తృప్తినిచ్చింది. ఇక 2009లో రేణు దేశాయ్ కు పవన్ కళ్యాణ్ కి అధికారికంగా వివాహం చేశారు మెగాస్టార్.
మరోవైపు.. 2010లో వచ్చిన పులి, 2011లో వచ్చిన తీన్మార్ కూడా తీవ్ర నిరాశనే మిగిలించాయి. వరుసగా సినిమాల పోయిన పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. పవన్ కళ్యాణ్ కి అంత క్రేజీ ఇలాంటి క్రేజీ సినిమాలు హిట్స్ వాళ్ళ మాత్రమే కాదు వ్యక్తిత్వం వలన మాత్రమే వస్తుంది.
అయితే పవన్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే . 2012 వరకు వారిద్దరూ బాగానే కలిసి మెలిసి ఉన్నా..రేణుదేశాన్ని విడిచిపెట్టడం. 2012లో రేణు దేశాన్ని విడిచిపెట్టి.. 2013లో ఎర్రగడ్డలో ఉన్న రిజిస్టర్ ఆఫీసులో అన్న లెజోవని వివాహం చేసుకున్నారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలామందికి నచ్చలేదు. అది కూడా కొడుకు అకీరానందన్, కూతురు ఆద్య ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమెని విడిచిపెట్టడం అభిమానుల్ని బాగా బాధ కలిగించింది.
సినిమాల పరంగా పవన్ అభిమానులకి ఎలాగైనా ఒక మంచి హిట్ అవ్వాలని హరీష్ శంకర్ దర్శకత్వంలో తెలుగు నెటివిటికి దగ్గరగా దబంగ్ సినిమాకు రిమేక్ గా 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ వచ్చింది. ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది . పవన్ కళ్యాణ్ అభిమానులకి గబ్బర్ సింగ్ ఒక విందు భోజనం అనే చెప్పాలి 35 కోట్లకు బిజినెస్ జరిగిన గబ్బర్ సింగ్ 60 కోట్ల 16 లక్షల షేర్ వసూలు చేసింది 250 కేంద్రాలలో డైరెక్ట్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి అవార్డ్స్ కంటే అభిమానుల రివార్డ్స్ ఎక్కువ.
దీని తర్వాత పూరీ దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు యావరేజ్ స్టాప్ తెచ్చుకున్న ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది మరో బ్లాక్ బస్టర్ హిట్. మళ్లీ వెంటనే పవర్ స్టార్ అభిమానులకి మరో విందు భోజనం అందించాడు. మొదటి సారి 100 కోట్లు సాధించిన తెలుగు సినిమాగా అత్తారింటికి దారేది రికార్డులు క్రియేట్ చేసింది.
తర్వాత 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2017 లో కాటమరాయుడు, 2018లో అజ్ఞాతవాసి అంతగా ఆటలేవు. పార్టీ ఆర్థికంగా కష్ట సమయంలో పవన్.. 2016లో హిందీలో వచ్చిన పింక్ సినిమా ని రీమేక్ చేశారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ మొదలుపెట్టారు. ఈ సినిమా పవన్ డబ్బు కోసమే చేశాడు. దిల్ రాజు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కు అప్పటివరకు ఏ టాలీవుడ్ హీరోకు ఇవ్వలేనంత రెమ్యూరేషన్ ఇచ్చారు.దాదాపు 50 కోట్ల వరకు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ రెమినేషన్ తీసుకున్నాడని టాక్. 2021 ఏప్రిల్ 9న విడుదలైన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్ల వరకు వసూలు చేసింది.
రాజకీయ జీవితం
2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ అహర్నిశలు ప్రచారం చేశాడు ఆ పార్టీ యువజన నాయకుడుగా ఎటువంటి పదవులు ఆశించకుండా ఆ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. అయితే ఆ ప్రచారంలో ఆవేశంగా మాట్లాడేవారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో 2011లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. దీంతో పవన్ కి చిరంజీవికి కాస్త దూరం పెరిగింది. కానీ ఏ రోజు అన్నకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న ఒక్కడే అభిమానులు సమక్షంలో జనసేన పార్టీని స్థాపించాడు జనసేన పార్టీ భావజాలంతో కూడిన ఒక పుస్తకం కూడా రాశాడు. నరేంద్ర మోడీని కలిసి రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల వివరించాడు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపికి బిజెపికి సపోర్ట్ చేసి టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ జనసేన ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు. ఇలా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ నిత్యం ప్రజల మధ్యనే ఉన్నాడు.
2019 ఎన్నికల్లో జనసేన 175 స్థానాలు గాను 140 స్థానాల్లో పోటీ చేసింది.ఈ ఎన్నికల్లో.. పవన్.. భీమవరం, గాజువాక రెండు స్థానాల్లోనూ పోటీ చేశాడు. కానీ ఆ రెండు చోట్ల ఓడిపోయాడు మిగతా 138 స్థానాల్లో ఒక తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రాపాక వరప్రసాద రావు గారు తప్ప ఇంకెవరూ గెలవలేదు. అయినా కూడా పవన్ కళ్యాణ్ నిరాశ చెందలేదు. ప్రజల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తునే ఉన్నారు. ప్రజల కోసమే తాను పార్టీని స్థాపించాను. కానీ పదవుల కోసం కాదు అని ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నాడు.2020 జనవరి నుంచి బిజెపితో పొత్తు పెట్టుకున్నాడు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేనా, టీడీపీలు కలిసి బరిలో దిగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కి తెలంగాణ , ఆంధ్ర రాష్ట్రాలలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఫాన్స్ Pawan Kalyan ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రొఫైల్
పూర్తి పేరు : కొణిదెల కళ్యాణ్ బాబు (పవన్ కళ్యాణ్)
వృత్తి : నటుడు, రచయిత, రాజకీయవేత్త
పుట్టిన తేదీ : 2 సెప్టెంబర్ 1971,
జన్మస్థలం : బాపట్ల, ఆంధ్రప్రదేశ్
తండ్రి : కొణిదెల వెంకట్ రావు,
తల్లి అంజనా దేవి కొణిదెల
తోబుట్టువులు : చిరంజీవి, నాగేంద్రబాబు, విజయ దుర్గ
భార్య : నందిని (1997 – 2007), రేణు దేశాయ్ (2009 – 2012),అన్నా లెజ్నేవా (2013 – ప్రస్తుతం)
పిల్లలు : ఆధ్య కొణిదల, అకిరా నందన్, పోలెనా, మార్క్ శంకర్ పవనోవిచ్