యువకుడిపై తన లవర్ మాజీ ప్రియుడి కాల్పులు.. హర్యానాలో వ్యక్తి దుర్మరణం

Published : Nov 15, 2022, 04:55 AM IST
యువకుడిపై తన లవర్ మాజీ ప్రియుడి కాల్పులు.. హర్యానాలో వ్యక్తి దుర్మరణం

సారాంశం

హర్యానాలో తన లవర్్ వద్దకు వచ్చిన ఆమె మాజీ ప్రియుడు ఆయనపై దాడి చేశాడు. ధారుహేరాలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రికల్లా నిందితుడిని పట్టుకున్నారు.  

న్యూఢిల్లీ: హర్యానాలో ఓ యువకుడిపై మరో యువకుడు కాల్పులు జరిపాడు. హాస్పిటల్ తీసుకెళ్లి బాధితుడిని అడ్మిట్ చేశారు. ట్రీట్‌మెంట్ పొందుతూనే పరిస్థితులు మించిపోయి మరణించాడు. ఈ ఇద్దరు యువకుల మధ్య శత్రుత్వానికి కారణం వారి లవ్ స్టోరీ. తన లవర్ గతంలో ప్రేమించిన యువకుడే బాధితుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన హర్యానాలోని ధారుహెరాలో చోటుచేసుకుంది.

26 ఏళ్ల మనోజ్ కుమార్ ఉత్తరప్రదేశ్‌లోని మాథుర జిల్లా సన్‌రాఖ్ గ్రామస్తుడు. మనోజ్ కుమార్, ఓ మహిళ గతంలో ఆరేడు సంవత్సరాలు ప్రేమించుకున్నారు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కానీ, తాజాగా వారిద్దరూ విడిపోయారు. ఆ యువతి తాజాగా రాజస్తాన్‌ భరత్‌పూర్‌కు చెందిన జిరోలి గ్రామస్తుడు 19 ఏళ్ల మనీష్ కుమార్‌ను ప్రేమిస్తున్నది.

మనీష్ కుమార్ ఆ యువతితో కలిసి హర్యానాలోని ధారుహెరాలోని ఆజాద్ కాలనీలో 15 రోజుల క్రితమే జీవించడం మొదలు పెట్టారు. 

Also Read: పండుగ రోజున విషాదం: ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడి ఆత్మహత్య

మనోజ్ శనివారం రాత్రి ఆ యువతి దగ్గరకు వచ్చాడు. ఆ లేట్ నైట్‌లో మనీష్ కుమార్ ఆమె గదిలో కనిపించాడు. ఈ తరుణంలోనే మనీష్, మనోజ్‌కు మధ్య గొడవ మొదలైంది. మనీష్ కుమార్ నుదుటి పై మనోజ్ కుమార్ కాల్పులు జరిపాడు. ఆ తర్వాత నిందితుడు స్పాట్ నుంచి బైక్ పై పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. 

ఆదివారం రాత్రి మనోజ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నేరం చేసినట్టు అంగీకరించాడు. ధారుహేరా పోలీసు స్టేషణ్‌లో ఆయన పై మర్డర్ కేసు నమోదైంది. 

పోలీసులకు అందింని ఫిర్యాదు ప్రకారం, మనోజ్‌తో ఆ యువతి ఏడేళ్లపాటు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు తెలిసింది. వారి మధ్య  ఈ సంబంధాన్ని మనోజ్ కుమారే అభ్యంతరం తెలిపాడని ఫిర్యాదు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం