పొరుగింటి వ్యక్తితో కలిసి భర్తను హతమార్చిన భార్య.. పక్కింటిలోనే 7ఫీట్ల లోతులో పూడ్చిపెట్టారు.. 4ఏళ్ల తర్వాత..!

Published : Nov 15, 2022, 02:01 AM IST
పొరుగింటి వ్యక్తితో కలిసి భర్తను హతమార్చిన భార్య.. పక్కింటిలోనే 7ఫీట్ల లోతులో పూడ్చిపెట్టారు.. 4ఏళ్ల తర్వాత..!

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నాలుగేళ్ల కిందటి నేరం తాజాగా వెలుగుచూసింది. పొరుగింటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత ఆయనతో కలిసి భర్తనే హతమార్చింది. పిస్టల్‌తో కాల్చి, గొడ్డలితో నరికి పొరుగింటిలోనే ఏడు అడుగుల లోతులో పాతిపెట్టారు.  

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లో నాలుగేళ్ల క్రితం నాటి నేరం బయటపడింది. ఇన్నాళ్లు బాధితురాలి వేషం వేసిన నిందితురాలే కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించింది. కానీ, చివరకు పోలీసులు అసలు నిందితులను పట్టుకున్నారు. పొరుగింటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ వివాహిత ఏకంగా భర్తనే హతమార్చే ప్లాన్ వేసింది. పొరుగింటి వ్యక్తి, తాను కలిసి భర్తను చంపేశారు. ఆ పక్కింటిలోనే ఏడు అడుగుల లోతు తవ్వి డెడ్ బాడీని పూడ్చి పెట్టారు. అప్పటి నుంచి తన భర్తను కిడ్నాప్ చేశారని, తన తమ్ముడిపైనే ఆరోపణలు చేస్తూ వస్తున్నది.

సవిత, చందర్ వీర్‌లు దంపతులు. 2018లో తన భర్తను కిడ్నాప్ చేశారని సవిత పోలీసు కేసు పెట్టింది. చివరి వరకు ఈ నేరాన్ని తన తమ్ముడికి ఆపాదించినట్టు పోలీసులు వివరించారు. 

క్రైమ్ బ్రాంచీ తమకు కొంత మంచి సమాచారం ఇచ్చిందని ఎస్పీ (క్రైమ్) దీక్ష శర్మ తెలిపారు. ఆ సమాచారంతోనే కేసు రీఇన్వెస్టిగేట్ చేసినట్టు తెలుస్తున్నది. అయితే, ఆ సమాచారం ఏంటనే విషయాన్ని వెల్లడించలేరు.

Also Read: భర్తను చంపిన కేసులో బ్రెజిల్ మహిళా రాజకీయవేత్తకు 50 యేళ్ల జైలుశిక్ష...

సవితకు పొరుగున ఉండే అరుణ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. సవిత, అరుణ్‌లు కలిసి ప్లాన్ ప్రకారం ఆమె భర్తను చంపేశారు. తుపాకీతో కాల్చి ఆ తర్వాత నరికేశారు. అరుణ్ ఇంట్లో ఏడు అడుగుల గుంత రెడీగా ఉన్నది. తాజాగా, మర్డర్ కేసు ఫైల్ అయిన తర్వాత చందర్ వీర్ డెడ్ బాడీని తవ్వి తీశారు. ఆమె డెడ్ బాడీ కేవలం అస్తి పంజారంతా మారిపోయింది. ఈ అస్తిపంజరాన్ని సోమవారం తవ్వి తీశారు. 

చందర్ వీర్ హత్య కోసమే ముందస్తుగానే ఈ గుంత తవ్వి ఉంచినట్టు తెలుస్తున్నది. చందర్ వీర్‌ను చంపేసిన తర్వాత ఆయన డెడ్ బాడీని ఆ గుంతలో పూడ్చి పెట్టారు. ఆ తర్వాత అదే సమాధిపై నిర్మాణం చేపట్టారు. ఆ డెడ్ బాడీ నుంచి స్మెల్ రాకుండా ఉంచుకోవడానికి ఏడు అడుగుల లోతు వరకు తవ్వి సమాధి చేశారు. చందర్ వీర్‌ను చంపడానికి వినియోగించిన పిస్టల్, గొడ్డలి కూడా లభించినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం