టిక్ టాక్ చేస్తుండగా విరిగిన మెడ.. యువకుడి మృతి

Published : Jun 24, 2019, 09:34 AM IST
టిక్ టాక్ చేస్తుండగా విరిగిన మెడ.. యువకుడి మృతి

సారాంశం

ఇటీవల కాలంలో విపరీతంగా పాపులారిటీ సంపాదించుకున్న మ్యూజిక్ యాప్ టిక్ టాక్. ఈ యాప్ ద్వారా చాలా మంది యువతీ యువకులు పాపులారిటీ సంపాదించుకున్నారు. 

ఇటీవల కాలంలో విపరీతంగా పాపులారిటీ సంపాదించుకున్న మ్యూజిక్ యాప్ టిక్ టాక్. ఈ యాప్ ద్వారా చాలా మంది యువతీ యువకులు పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒకరిని చూసి మరొకరు వీడియోలు తీసి.. వాటిని టిక్ టాక్ లో పోస్టు చేసి క్రేజ్ సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నారు. కాగా.. మరో యువకుడు ఈ యాప్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల ఓ యువకుడు టిక్ టాక్ చేస్తూ మెరవిరగ కొట్టుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ యువకుడు ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే...కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్ళి తాలూకా గూడకెరె గ్రామానికి చెందిన కుమార్‌ అనే వ్యక్తి పల్టీ కొట్టే సాహసం చేశాడు.ఓ మిత్రుడు ఎదురుగా సపోర్ట్‌గా ఉండగా మరొకరు వీడియో తీస్తున్నారు. ఆర్కెస్ట్రాలలో డ్యాన్సులలో చేసే కుమార్‌ బ్యాక్‌ జంప్‌ చేసేందుకు వెళ్ళి ఫీట్‌ను పూర్తి చేయలేకపోయాడు

 దీంతో మెడ నేలలో కూరుకుపోగా ఒక్కసారిగా కుప్పకూలాడు. మెడ భాగం విరిగిపోగా స్పైనల్‌కార్డ్‌ ఎముకలు విరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు బెంగళూరు ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 
 

PREV
click me!

Recommended Stories

Cyber Crime : ఇక సైబర్ నేరాలకు చెక్.. రంగంలోకి స్పెషల్ పోలీసులు
Climate Warning: రక్తంలా మారుతున్న నదులు ! ముంచుకొస్తున్న పెను ముప్పు? అంతమేనా !