నెంబర్ ప్లేట్ లేని కంటైనర్.. పది రోజులుగా: కుష్బూ ఇంటి వద్ద కలకలం

Siva Kodati |  
Published : Jun 24, 2019, 07:44 AM IST
నెంబర్ ప్లేట్ లేని కంటైనర్.. పది రోజులుగా: కుష్బూ ఇంటి వద్ద కలకలం

సారాంశం

ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ నేత కుష్బూ ఇంటి ముందు కంటైనర్ కలకలం రేపింది

ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ నేత కుష్బూ ఇంటి ముందు కంటైనర్ కలకలం రేపింది. దాదాపు 10 రోజుల నుంచి తన ఇంటి ముందు నెంబర్ ప్లేట్ లేని లారీ నిలిపి ఉందని.. అయితే దీనిని ప్రజలెవరు పట్టించుకోవడం లేదని కనీసం ఫిర్యాదు చేసే ఆలోచన సైతం ఎవరికి రావడం లేదంటూ కుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో చివరికి ఆమె లారీని పోటో తీసి ట్వీట్టర్‌లో పెట్టారు. నెంబర్ ప్లేట్ లేనందున అనుమానించాల్సి వస్తోందని.. చెన్నై పోలీసులు దీనిపై దృష్టి సారించాలని కుష్బూ కోరారు. అయితే ఆమె ట్వీట్‌పై నెటిజన్లు పంచ్‌లు విసిరారు.

పోలీసులకు మీరెందుకు ఫిర్యాదు చేయకూడదని కొందరు హేళనకు వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన కుష్బూ సదరు లారీ తన వీధిలో లేదని.. అలా ఉన్నట్లయితే తాను ఫిర్యాదు చేసేదాన్నని స్పష్టం చేశారు. అలా కాకుండా హేళనగా వ్యాఖ్యలు చేయడం సరికాదని కుష్బూ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Republic Day 2026 : కర్తవ్యపథ్ లో రిపబ్లిక్ డే వేడుకలు... హాజరైన విదేశీ అతిథులు ఎవరో తెలుసా..?
Gallantry Award : సాధారణ తెలుగు కానిస్టేబుల్ కి శౌర్య పతకం.. ఎవరీ మర్రి వెంకట్ రెడ్డి..? ఏ సాహసం చేశాడు..?