ప్రియుడితో వివాహిత జంప్..పోలీస్ స్టేషన్ లో దాడి

Published : Dec 08, 2018, 12:04 PM IST
ప్రియుడితో వివాహిత జంప్..పోలీస్ స్టేషన్ లో దాడి

సారాంశం

వివాహం జరిగిన ఆరు నెలలకే ఓ మహిళ.. మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో లేచిపోయింది కూడా.

వివాహం జరిగిన ఆరు నెలలకే ఓ మహిళ.. మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో లేచిపోయింది కూడా. పారిపోయిన వారిని కష్టపడి పోలీసులు పట్టుకొని అరెస్టు చేస్తే..మహిళ సోదరుడు.. ఆమె ప్రియుడిపై కత్తితో దాడిచేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. విరుదాచలం, పెన్నాడు సమీపం కొత్తపై గ్రామానికి చెందిన వసంతకుమార్‌ (27)కి ఆరు నెలల క్రితం శశిప్రియ(26)తో వివాహమైంది. గతనెల పుట్టింటికి వెళ్లిన శశిప్రియకు పడుగలై గ్రామానికి చెందిన ప్రకాష్‌ (28)తో వివాహేతర సంబంధం ఏర్పడింది.

వీరిద్దరూ ఊరు వదలి పారిపోయారు. దీనిపై వసంతకుమార్, అతని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెన్నడం పోలీసులు చెన్నైకి వెళ్లి శశిప్రియ, ప్రకాష్‌ ఇద్దరిని పోలీసుస్టేషన్‌కు రప్పించారు. శశిప్రియ, వసంతకుమార్, ప్రకాష్‌ల తల్లిదండ్రులను పోలీసుస్టేషన్‌కు రప్పించి చర్చలు జరుపుతున్నారు. ఆ సమయంలో శశిప్రియ తాను ప్రకాష్‌తో వెళతానని చెప్పినట్టు తెలిసింది. 

దీంతో ఆగ్రహం చెందిన శశిప్రియ తమ్ముడు శ్రీరంగన్‌ (25) తాను వెంటతెచ్చుకున్న కత్తిని బయటకు తీసి ప్రకాష్‌ ముఖంపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ప్రకాష్‌ను పెన్నాడం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

పాము కాటుతో మ‌ర‌ణించిన తండ్రి పేరుపై రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్‌.. అస‌లు మ్యాట‌ర్ తెలిస్తే ఫ్యూజులు అవుట్
MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్