ఈబీసీ రిజర్వేషన్ బిల్లుపై సుప్రీంకోర్టులో పిటిషన్

By narsimha lodeFirst Published Jan 10, 2019, 3:17 PM IST
Highlights

ఈబీసీ బిల్లుపై గురువారం నాడు  యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంధ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.


న్యూఢిల్లీ: ఈబీసీ బిల్లుపై గురువారం నాడు  యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంధ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగ విరుద్దమని ఆ సంస్థ ఆ పిటిషన్‌లో అభిప్రాయపడింది.  1992 లో సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా ఈబీసీలకు రిజర్వేషన్లను కల్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆ సంస్థ ఆరోపించింది.

రాజ్యాంగంలోని 124 సవరణ ద్వారా ఈబీసీలకు రిజర్వేషన్లను కల్పించడాన్ని ఈ సంస్థ తప్పుబట్టింది. రాజ్యాంగ సవరణ చేపట్టి ఈ బిల్లును ప్రవేశపెట్టింది. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఈ బిల్లును తీసుకొచ్చినట్టుగా  కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలోనే ప్రకటించారు.

ఒకవేళ ఈ పిల్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకొంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 
 

click me!