23 దేశాలను చుట్టొచ్చిన టీ కొట్టు యజమాని

By narsimha lodeFirst Published Jan 10, 2019, 2:24 PM IST
Highlights

కేరళకు చెందిన ఓ టీ కొట్టు యజమాని తన భార్యతో కలిసి విదేశాలను చుట్టి వచ్చారు. ప్రపంచ దేశాల్లో పర్యటించాలనే తన కలను సాకారం చేసుకొన్నారు. 

తిరువనంతపురం: కేరళకు చెందిన ఓ టీ కొట్టు యజమాని తన భార్యతో కలిసి విదేశాలను చుట్టి వచ్చారు. ప్రపంచ దేశాల్లో పర్యటించాలనే తన కలను సాకారం చేసుకొన్నారు. ఈ విషయమై ఈ దంపతులను  భారత కుబేరులు అంటూ మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా కొనియాడారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ దంపతులను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

కేరళ రాష్ట్రానికి చెందిన  విజయన్  టీ కొట్టు నిర్వహిస్తున్నాడు. 55 ఏళ్లుగా టీ కొట్టు నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నారు. విజయన్‌కు ప్రపంచంలోని దేశాలను  చుట్టి రావాలనేది చిన్నప్పటి కల.  ఈ కలను సాకారం చేసుకొనేందుకుగాను తమ సంపాదనలో పొదుపు చేసేవాడు. ఇలా పొదుపు చేసిన డబ్బుతో  కొన్ని దేశాల్లో ఈ దంపతులు పర్యటించారు.

సింగపూర్, అర్జెంటీనా, స్విట్జర్లాండ్, బ్రెజిల్ వంటి  23 దేశాల్లో విజయన్ దంపతులు పర్యటించారు. మరికొన్ని దేశాల్లో కూడ విజయన్ దంపతులు పర్యటించేందుకు ప్లాన్ చేసుకొన్నారు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో విజయన్ టీ స్టాల్ నిర్వహిస్తున్నాడు దీనికితోడు ఆర్డర్లపై భోజనాన్ని కూడ సరఫరా చేసేవాడు. విదేశీయానం కోసం ప్రతి రోజూ రూ.300 పొదుపు చేసేవారు.

ఇలా పొదుపు చేసిన సంపాదనతో  ఈ దంపతులు ఇప్పటికే 23 దేశాల్లో పర్యటించారు. త్వరలోనే మరికొన్ని దేశాల్లో పర్యటించనున్నారు. విదేశీ పర్యటనలు చేసిన ఈ దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దంపతులు అపర కుబేరులు అంటూ  మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

click me!