టవల్ కట్టుకుని మెట్రో ట్రైన్‌ ఎక్కిన యువకుడు.. ‘ఈ కాన్ఫిడెన్స్ కావాలి’.. వైరల్ వీడియో ఇదే

Published : Dec 10, 2022, 04:46 PM IST
టవల్ కట్టుకుని మెట్రో ట్రైన్‌ ఎక్కిన యువకుడు.. ‘ఈ కాన్ఫిడెన్స్ కావాలి’.. వైరల్ వీడియో ఇదే

సారాంశం

ఓ యువకుడు టవల్ కట్టుకుని వైట్ టీషర్ట్ పై ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకుని ఢిల్లీ మెట్రో ట్రైన్ ఎక్కేశాడు. అందులోని ప్రయాణికులు అతడిని వేషధారణ చూసి షాక్ అయ్యారు. చాలా మంది నవ్వకుండా ఉండలేకపోయారు.  

న్యూఢిల్లీ: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఎంత వైరల్ అవుతాయో తెలిసిందే. డ్యాన్సులు, సింగింగ్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్స్, కామెడీ వీడియోలు ఇలా ఎన్నో ఉంటాయి. కొన్ని చాలా హాస్యంగా ఉంటాయి. అవి స్వల్పకాలంలోనే వైరల్ అయిపోతాయి. ప్రాంక్ వీడియోలూ తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.

ఓ యువకుడు పసుపు రంగు టవల్ నడుముకు చుట్టుకుని తెలుపు రంగు టీషర్ట్ వేసుకుని నిద్రలో నుంచి లేచి బయటకు వచ్చినట్టుగా ఢిల్లీ మెట్రో ట్రైన్ ఎక్కేశాడు. చాలా క్యాజువల్‌గా మెట్రో ట్రైన్ కంపార్ట్‌మెంట్‌లలో టవల్ పై తిరిగాడు. ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకుని కొన్ని సార్లు అద్దాల వైపు చూసుకుంటూ జుట్టు సరి చేసుకుంటున్నట్టు చేశాడు.

అందరూ రెడీ అయిపోయి ఆఫీసులకు వెళ్లుతున్నట్టుగా ఉన్న ప్రయాణికులు అతడిని ఆ లేజీ డ్రెస్‌లో చూసి షాక్ అయ్యారు. కొందరైతే నవ్వు ఆపుకోలేకుండా ఉండలేకపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Also Read: ధైర్యమా..?మూర్ఖత్వామా..? మొసలి వేషం వేసుకుని.. అసలు మొసలిని ఆటపట్టించిన వ్యక్తి.. ఆ తరువాత ఏమైందంటే..?

ఈ వీడియోను మోహిత్ గౌహర్ అనే యూజర్ పోస్టు చేశాడు. ‘ట్యాంక్‌లో నీళ్లు అయిపోయాయి. ఈ రోజు నేను ఆఫీసులోనే స్నానం చేసుకుంటా’ అనే క్యాప్షన్‌తో ఆ యువకుడు పోస్టు చేశాడు. దీనిపై నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ యువకుడి కాన్ఫిడెన్స్‌ను ప్రశంసించారు. తనకు కూడా ఇలాంటి కాన్ఫడెన్స్ కావాలంటూ చాలా మంది కామెంట్లు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM