యువకుడిని బైక్ కు కట్టేసి.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లి దారుణం.. వీడియో వైరల్...

Published : Jul 29, 2023, 07:21 AM IST
యువకుడిని బైక్ కు కట్టేసి.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లి దారుణం.. వీడియో వైరల్...

సారాంశం

బరేలీలో రద్దీగా ఉండే రోడ్డుపై స్కూటీకి ఓ యువకుడిని కట్టేసి, కిలో మీటర్ దూరం దుండగులు లాక్కెళ్లారు. ఈ వీడియో వైరల్ కావడంతో దర్యాప్తు ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్  రాష్ట్రంలోని బరేలీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ముగ్గురు వ్యక్తులు బైక్ మీద వెడుతూ.. ఓ యువకుడిని బండికి కట్టి లాక్కెళ్లారు. అలా కి.మీ మేర ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు.  ఈ ఘ ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బరేలీలోని బరాదరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్ హోలీ కూడలిలో ఈ ఘటన జరిగింది.ప్రియుడి మోజులో భర్తను హత్య చేసి.. మృతదేహాన్ని గొడలితో ముక్కలుగా నరికి..

ట్విటర్‌లో పోస్ట్ చేసిన సంఘటనకు సంబంధించిన వీడియోలో, స్కూటీపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడిని తాడుతో కట్టి లాగడం కనిపిస్తుంది. ఈ ఘటన మీద పోలీసుల విచారణ జరుగుతోంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో రోడ్డు పక్కన ఉన్న ఓ దుకాణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. జూలై 25న సాయంత్రం 4:35 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలో తెలుస్తోంది. ముందుగా ఆ యువకుడిని చౌరస్తా మధ్యలో స్కూటీకి కట్టేశారు. ఆ తరువాత వెంటనే, వారు అతనిని లాగడం ప్రారంభించారు. 

దీంతో యువకుడికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. దుండగులను ఇంకా గుర్తించలేదు. వారు ఎందుకు అలా చేశారో కూడా కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయాల్సి ఉంది. అయితే సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !