కూతురిని వెంబడించి అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై దాడి.. తర్వాత ఏం జరిగిందంటే..

Published : Dec 18, 2022, 11:53 AM IST
కూతురిని వెంబడించి అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై దాడి.. తర్వాత ఏం జరిగిందంటే..

సారాంశం

యువతిపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై ఆమె తండ్రి దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు స్నేహితుల‌తో కలిసి పోల్‌కు కట్టేసి కొట్టాడు.

యువతిపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై ఆమె తండ్రి దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు స్నేహితుల‌తో కలిసి పోల్‌కు కట్టేసి కొట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. వివరాలు.. డిసెంబర్ 13న రోడ్డుపై వెళ్తున్న యువతిని ఓ 25 ఏళ్ల యువకుడు తన మోటర్‌బైక్‌పై వెంబడించాడు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం యువతి ఇంట్లో చెప్పింది. దీంతో బాలిక తండ్రి యువకుడి ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఇందుకు యువతి తండ్రి  అతడి ఇద్దరు స్నేహితుల సాయం తీసుకన్నాడు. ఈ క్రమంలోనే శనివారం రోజున యువతిని వేధించిన  ప్రాంతంలోనే అతని ఆచూకీని గుర్తించారు.

అనంతరం యువతి తండ్రితో పాటు, అతని ఇద్దరు స్నేహితులు.. యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు. అయితే ఘటన స్థలానికి చేరుకన్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకన్నారు. యువతి  తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు నిందితుడైన యువకుడిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఆ యువకుడు.. తనపై దాడి జరిగినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !