కాసుల కోసం కన్న తల్లిదండ్రులు, నాన్నమ్మను చంపిన కసాయి

Published : May 19, 2023, 01:22 PM ISTUpdated : May 19, 2023, 01:25 PM IST
కాసుల కోసం కన్న తల్లిదండ్రులు, నాన్నమ్మను చంపిన కసాయి

సారాంశం

మానవ సంబంధాలకు మచ్చలాంటి దారుణ ఘటన చత్తీస్ ఘడ్ లో చోటుచేసుకుంది. డబ్బుల కోసం కన్నవారితో పాటు నాన్నమ్మను అతి కిిరాతకంగా కొట్టిచంపాడు ఓ కసాయి. 

రాయ్ పూర్ : జల్సాలకు అలవాటుపడ్డ ఓ యువకుడు డబ్బుల కోసం దారుణానికి ఒడిగట్టాడు.కన్నవారితో పాటు నాన్నమ్మను అతి కిరాతకంగా హతమార్చిన కిరాతకుడు మృతదేహాలను ఇంటివెనకాలే దహనం చేసాడు. అనంతరం కుటుంబసభ్యులు కనిపించడం లేదంటూ అతడే  పోలీసులకు ఫిర్యాదు చేసి తనకేమీ తెలియనట్లు నాటకం ఆడాడు. కానీ అసలునిజం బయటపడి నిందితుడు కటకటాలపాలయ్యాడు. 

 చత్తీస్ ఘడ్ మహాసముంద్ జిల్లాలోని పుట్కా గ్రామంలో చెంది ప్రభాత్ భోయ్, జర్నా భోయ్ దంపతులు కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. వీరికి ఉదిత్, అమిత్ లు సంతానం. అలాగే ప్రభాత్ తల్లి సులోచన కూడా వీరితో కలిసే వుంటోంది. 

అయితే విలాసవంతమైన జీవితం గడపాలని భావించి జల్సాలకు అలవాటుపడ్డ పెద్దకొడుకు ఉదిత్ డబ్బులకోసం తల్లిదండ్రులను వేధించేవాడు. ఈ క్రమంలోనే పదిరోజుల క్రితం డబ్బుల కోసం తల్లిదండ్రులతో గొడవపడ్డాడు ఉదిత్. అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన అతడు దారుణానికి ఒడిగట్టాడు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లిదండ్రులతో పాటు నాన్నమ్మపై దాడిచేసి హతమార్చాడు. అనంతరం ఇంటి వెనకాలే ముగ్గురి మృతదేహాలను దహనం చేసాడు.

Read More   మర్మాంగాన్ని చూపిస్తూ వెకిలిచేష్టలు... కేరళ యువతిపై ఆకతాయి లైంగిక వేధింపులు

 ఇలా కుటుంబసభ్యులను చంపేసిన ఉదిత్ ఉదయం వారు కనిపించడం లేదంటూ నాటకం ఆడాడు. హాస్పిటల్ కు వెళుతున్నామని చెప్పి బయటకు వెళ్ళిన తల్లిదండ్రులు, నాన్నమ్మ తిరిగి ఇంటికి రాలేదంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేసాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోదరుడు అమిత్ తో పాటు బంధువులకు కూడా పోలీసులకు చెప్పిందే చెప్పాడు ఉదిత్. 

అయితే ఇంట్లో రక్తపు మరకలు, ఇంటి వెనకాల భారీగా బూడిద గమనించిన అమిత్ కు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ ఇంటిని పరిశీలించారు. ఈ సమయంతో ఉదిత్ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజాన్ని బయటపెట్టారు. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతోనే తల్లిదండ్రులు, నాన్నమ్మను తానే చంపినట్లు ఉదిత్ ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం