ఆస్తి సోదరిపేరిట రాశారని.. తల్లిదండ్రులను కాల్చేసి..!

Published : Sep 03, 2021, 09:56 AM IST
ఆస్తి సోదరిపేరిట రాశారని.. తల్లిదండ్రులను కాల్చేసి..!

సారాంశం

ఈ హత్య ఎవరు చేశారా అని పోలీసులు దర్యాప్తు  చేపట్టారు. ఆ కుటుంబానికి ఎవరికీ గొడవలు లేవని తేలడంతో.. ఆ కుటుంబంలో మిగిలిన  ప్రదీప్ మాలిక్ కుమారుడు అభిషేక్ పై పోలీసులకు అనుమానం కలిగింది. 

ఆస్తి తన పేరిట కాకుండా.. సోదరి పేరిట రాశారని ఓ 21ఏళ్ల కుర్రాడు దారుణానికి ఒడిగట్టాడు. కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన సోదరిని అతి దారుణంగా తుపాకీతో  కాల్చేసి చంపేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత తనకేమీ తెలియనట్లు నటించాడు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హర్యా నా రాష్ట్రం రోహ్ తక్ జిల్లా లోని విజయన్ నగర్ కాలనీకి చెందిన  ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు.బయట నుంచి సడెన్‌గా ఇంట్లోకి దూరిన నిందితుడు ఆ కుటుంబంపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో ప్రదీప్ మాలిక్, అతని భార్య, అత్త, కుమార్తె నేహా మాలిక్ మరణించారు. ప్రదీప్, అతని భార్య, అత్తగారు అక్కడికక్కడే మరణించగా.. నేహా మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.

ఈ హత్య ఎవరు చేశారా అని పోలీసులు దర్యాప్తు  చేపట్టారు. ఆ కుటుంబానికి ఎవరికీ గొడవలు లేవని తేలడంతో.. ఆ కుటుంబంలో మిగిలిన  ప్రదీప్ మాలిక్ కుమారుడు అభిషేక్ పై పోలీసులకు అనుమానం కలిగింది. 

 ఈ ఘటన జరిగినప్పుడు అభిషేక్ ఇంట్లో లేడు. విచారణ సందర్భంగా అతను షాకింగ్ నిజం వెల్లడించాడు. అమ్మానాన్న, అమ్మమ్మ, అక్కను తానే హత్య చేసినట్లు అభిషేక్ అంగీకరించాడు. ఈ విషయాన్ని వెల్లడించిన పోలీసులు.. కుటుంబ సభ్యులతో అభిషేక్ తరచూ గొడవ పడుతూ ఉండేవాడని చెప్పారు.

ఆస్తి తన సోదరి పేరుమీద పెట్టడం అభిషేక్‌కు నచ్చలేదని, ఆ విషయంలో కుటుంబంతో ఇటీవలే చాలా పెద్ద గొడవ పెట్టుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాతే తుపాకీతో కుటుంబంపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హతమార్చాడు. అనంతం ఏమీ ఎరగనట్లు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. హత్యల విషయం బయటపడినప్పుడు కూడా.. పోలీసుల ముందు తనకేం తెలియనట్టు నటించాడు. ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టాడు. కానీ అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో అతడు ఎట్టకేలకు నిజం వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu