ఎన్నెన్నో జన్మల బంధం : కుమార్తె పెళ్ళిలో స్టెప్పులేసిన కేంద్రమంత్రి.. వైరల్ అయిన వీడియో..

Published : Sep 03, 2021, 09:23 AM IST
ఎన్నెన్నో జన్మల బంధం : కుమార్తె పెళ్ళిలో స్టెప్పులేసిన కేంద్రమంత్రి.. వైరల్ అయిన వీడియో..

సారాంశం

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ తన సతీమణితో కలిసి డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఆయన కుమార్తె వివాహ వేడుక బుధవారం రాత్రి హుబ్లీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన తన భార్యతో కలిసి ఓ కన్నడ పాత సినిమా పాటకు హుషారుగా స్టెప్పులు వేశారు. 

హుబ్లీ : కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ కుమార్తె వివాహ రిసెప్షన్ లో పలువురు రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. గురువారం కర్ణాటకలోని హుబ్లీ నగరంలో జరిగిన ఈ వివాహ విందుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై,  గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో పాటు పలు రంగాల ప్రముఖులు విచ్చేశారు నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ తన సతీమణితో కలిసి డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఆయన కుమార్తె వివాహ వేడుక బుధవారం రాత్రి హుబ్లీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన తన భార్యతో కలిసి ఓ కన్నడ పాత సినిమా పాటకు హుషారుగా స్టెప్పులు వేశారు. ఆయన డాన్స్ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !