సీన్ రివర్స్: సెక్స్‌కు ఒప్పుకోలేదని బాలుడిని చంపిన యువకుడు

sivanagaprasad kodati |  
Published : Dec 24, 2018, 08:23 AM IST
సీన్ రివర్స్: సెక్స్‌కు ఒప్పుకోలేదని బాలుడిని చంపిన యువకుడు

సారాంశం

తనతో శృంగారానికి అంగీకరించలేదని చిన్నారులను, యువతులను, మహిళలను కామాంధులు చంపడం ఇప్పటి వరకు మనం చూశాం. కానీ సెక్స్‌కు అంగీకరించలేదని ఒక బాలుడిని మరో బాలుడు హత్య చేయడం చూశామా... విదేశాల్లో తరచుగా జరిగే ఈ తరహా ఘటనలు ఇప్పుడు మనదేశంలోనూ జరుగుతున్నాయి. 

శృంగారానికి అంగీకరించలేదన్న కోపంతో ఓ పదేళ్ల బాలుడిని 15 ఏళ్ల బాలుడు దారుణంగా హతమార్చాడు. ముంబై లాల్‌బహదూర్ శాస్త్రి నగర్‌కు చెందిన ఒక వ్యక్తి తన కుమారుడు కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మీ అబ్బాయిని కిడ్నాప్ చేశామని, రూ.5 లక్షలు ఇస్తేనే వదిలేస్తామని బెదిరించారని ఆయన పోలీసులకు తెలిపారు. అలాగే శుక్రవారం సాయంత్రం తన కుమారుడిని ఓ టీనేజర్ స్నేహితుడితో చూశానని చెప్పాడు.

రంగంలోకి దిగిన పోలీసులు ముందుగా ఫోన్‌కాల్‌పై ఆరా తీశారు. సిమ్ నెంబర్ ఆధారంగా ఒక అడ్రస్‌కు వెళ్లగా ఆ సిమ్‌ను తన కుమారుడు వాడుతున్నాడని తెలిపాడు. అనంతరం ఆ యువకుడిని విచారించగా..తనతో సెక్స్‌కు అంగీకరించనందున తానే బాలుడిని ఓ మరుగుదొడ్డిలో గొంతునులిమి హత్య చేసినట్లు అంగీకరించాడు.

ఆధారాలు మాయం చేయడానికి శవాన్ని సూట్‌కేసులో కుక్కి సకినాకా రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడేసినట్లు తెలిపాడు. యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలల న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి... చిల్డ్రన్ హోమ్‌కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ