ముఖంపై మొటిమలు తగ్గట్లేవని యువతి ఆత్మహత్య.. పెళ్లి కుదరట్లేదనీ మనస్తాపం

By Mahesh KFirst Published May 24, 2022, 7:57 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో ఓ యువతి ముఖంపై మొటిమలు తగ్గట్లేవని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఎన్ని రకాల చికిత్స చేసినా మొటిమలు తగ్గలేవు. ఈ మొటిమల కారణంగానే పెళ్లి సంబంధాలు కుదరలేవు. దీంతో మనస్థాపానికి గురైన యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
 

లక్నో: ముఖంపై మొటిమలు రావడం సహజం. సాధారణంగా నిర్దిష్ట వయసులోగా మళ్లీ అవి మటుమాయం అవుతుంటాయి. కానీ, కొందరిలో వారి శరీరాలకు తగినట్టు ఎక్కువ కాలం ఉనికిలోనే ఉంటాయి. ఇంకొందరిలో మరీ ఎక్కువ కాలం ముఖంపై మొటిమలు కనిపిస్తూనే ఉంటాయి. మొటిమలను కనుమరుగు చేయడానికి పలు విధాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ మొటిమల కారణంగా చాలా మంది బాధపడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు మరీ ఎక్కువగా ఈ బాధకు లోనవుతుంటారు. ఇంత వరకు ఓకే. కానీ, మొటిమలు పోవట్లేవని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎప్పుడైనా విన్నారా? ఉత్తరప్రదేశ్‌లో అలాంటి దారుణమే జరిగింది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బందా జిల్లాలో ఓ యువతి మొటిమల సమస్యతో బాధపడింది. వాటిని ఎలాగైనా తొలగించుకోవాలని అనేక ప్రయత్నాలు చేసింది. పలు రకాల చికిత్సలు కూడా చేయించుకుంది. కానీ, మొటిమలు పోలేదు. ఈ మొటిమల కారణంగా ఆమె తన మిత్రుల నుంచి చదువుకునే చోట కూడా కొంత చిన్నచూపును ఎదుర్కొంది. అవన్నీ ఒక ఎత్తు అయితే.. పెళ్లి చూపులు ఈ మొటిమల కారణంగానే విఫలం కావడం పెద్ద సమస్యగా మారి కూర్చుంది. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ సమస్య కారణంగా ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సోమవారం సాయంత్రం బిసందా పోలీసు సర్కిల్‌‌లోకి వచ్చే అజిత్ పారా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పశువులకు మేత వేసి ఇంటికి రాగానే తన కూతురు ఉరి తాడుకు వేలాడుతుండటాన్ని తల్లి చూసింది. బాలిక కుటుంబ సభ్యలు వివరాల ప్రకారం, ఆమె ముఖంపై మొటిమలను చూసి ఆమె తీవ్ర నిరాశకు లోనయ్యేది. ఎన్నో రకాల ట్రీట్‌మెంట్లు తీసుకున్నా అవి తగ్గలేవు. తమ బిడ్డకు చాలా మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయని వారు చెప్పారు. కానీ, ఆమె ముఖంపై మొటిమలు చూసి అందరూ పెళ్లిని తిరస్కరించారని పేర్కొన్నారు. 

ఆ బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

click me!