ఈషా అగ్రో మూవ్‌మెంట్.. సేంద్రియ వ్యవసాయం బాట పట్టిన సివిల్ ఇంజనీర్.. అతని జర్నీ ఎలా సాగిందంటే..

Published : May 24, 2022, 06:03 PM IST
 ఈషా అగ్రో మూవ్‌మెంట్.. సేంద్రియ వ్యవసాయం బాట పట్టిన సివిల్ ఇంజనీర్.. అతని జర్నీ ఎలా సాగిందంటే..

సారాంశం

ఈషా అగ్రో మూవ్‌మెంట్ అనేది రైతుల ఉద్యమం. ఇది రసాయనిక వ్యవసాయ పద్ధతుల కంటే రైతులకు అధిక ఆర్థిక రాబడిని అందించే స్వయం సమృద్ధ వ్యవసాయ వ్యవస్థ కోసం కృషి చేస్తుంది. ఇది వ్యవసాయాన్ని, పంటనే కాదు, నేల రూపురేఖలను కూడా ఎలా మారుస్తుందో చెప్పడానికి వల్లువన్ అద్భుతమైన ఉదాహరణ.

ఈషా అగ్రో మూవ్‌మెంట్ అనేది రైతుల ఉద్యమం. ఇది వ్యవసాయాన్ని, పంటనే కాదు, నేల రూపురేఖలను కూడా ఎలా మారుస్తుందో చెప్పడానికి వల్లువన్ అద్భుతమైన ఉదాహరణ. వల్లువన్ వృత్తి రీత్యా సివిల్ ఇంజనీర్.. అయితే ఈషా ఆగ్రో మూవ్‌మెంట్,  సద్గురు ప్రభావంతో వ్యవసాయం వైపు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోని పొల్లాచ్చిలో తన అందమైన, లాభదాయకమైన సేంద్రీయ కొబ్బరి తోటను నిర్వహిస్తున్నారు. ఈషా ఫౌండేషన్ వాలంటీర్ నేడు సహజ సేంద్రియ వ్యవసాయంలో దూసుకుపోతున్నారు. 

వల్లవున్ చేసిన ఈ పని.. విజయవంతమైన, అద్భుతమైన సేంద్రీయ వ్యవసాయానికి ఒక ప్రత్యేక ఉదాహరణ. ఇది పూర్తిగా సేంద్రియ వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. వల్లువన్ 2001 నుంచి ఈషా ఫౌండేషన్‌తో వాలంటీర్‌గా  ఉన్నారు. అతనికి తొలుత వ్యవసాయం గురించి ఏమి తెలియదు. అయితే తరచుగా సద్గురు.. రైతుల కష్టాలు, వ్యవసాయంతో ముడిపడి ఉన్న సవాళ్లు, సమాజంపై దాని ప్రభావం గురించి మాట్లాడటం వింటూ ఉండేవాడినని వల్లువన్ చెప్పారు. 

అలాగే.. ఎక్కడ చూసినా వ్యవసాయ భూమిని తక్కువ ధరకు ఎలా అమ్ముతున్నారు?, వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గడం, పంటలపై పురుగుల దాడి పెరగడం, పంట సరిగా లేకపోవడం.. ఇలా వివిధ కారణాలతో సరిపడా దిగుబడి రాకపోవడంతో రైతులు పండించిన శ్రమకు గిట్టుబాటు ధర లభించడం లేదని సద్గురు చెప్పిన మాటలు తాను చాలా సార్లు విన్నానని వల్లువన్ చెప్పారు. 

వల్లువన్ ప్రకారం.. రైతులకు వ్యవసాయాన్ని లాభదాయకంగా ఎలా మార్చాలో, అదే సమయంలో వినియోగదారులకు ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఆహారాన్ని ఎలా అందించాలో నేను ఎప్పుడూ ఆలోచిస్తున్నాను. రెండూ వేర్వేరు ప్రక్రియలు.. దంతో వాటిని పునరుద్దరించడం అసాధ్యం అనిపించింది. ఆ తర్వాత నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇందుకోసం అన్నామలై కొండల మధ్య వెట్టైకారన్‌పుదూర్ గ్రామంలో పొలాలు కొన్నాను. ఆ తర్వాత నా ప్రయాణం ఈషా ఆగ్రో ఉద్యమంతో ప్రారంభమైంది. ఈషా ఫౌండేషన్‌తో అనుబంధం ఉన్న వాలంటీర్లు నా పొలాలకు వచ్చి వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకునేవారు. వాలంటీర్ల మాటలు నాకు అర్థం అయ్యేవి కావు. అయినప్పటికీ, వ్యవసాయానికి సంబంధించిన విషయాల గురించి నాకు తెలియదు కాబట్టి.. నేను వారి మాటలను అనుసరించాలని నిర్ణయించుకున్నాను. ఈ విధంగా.. 2009 నుండి ఈ సాగు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.

ఆరంభంలో పొలాల్లో మార్పు కనిపించడం కూడా కష్టంగా ఉండేదని వల్లువన్ చెప్పారు. ఇంతలోనే కరువు వచ్చిందని.. తర్వాత వర్షం కూడా కురిసిందని.. అప్పుడు మట్టిలో తేడా చూసి అర్థం చేసుకున్నానని తెలిపారు. అప్పటి నుంచి తాను భూమిని దగ్గరగా అర్థం చేసుకోవడం ప్రారంభించానని చెప్పారు. తాను మొదట పంట గురించి చింతించలేదని.. తరువాత క్రమంగా, సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. నేల, పంట మెరుగుపడటం ప్రారంభమైందని చెప్పారు. ఇప్పుడు పొలం అద్భుతంగా కనిపిస్తుందని, పంట కూడా పుష్కలంగా ఉందని తెలిపారు. రసాయనాలు వాడకుండానే మట్టి రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. 

ఈషా అగ్రో మూవ్‌మెంట్ గురించి..
ఇక, ఈషాఅగ్రో మూవ్‌మెంట్ అనేది రైతుల ఉద్యమం. ఇది రసాయనిక వ్యవసాయ పద్ధతుల కంటే రైతులకు అధిక ఆర్థిక రాబడిని అందించే స్వయం సమృద్ధ వ్యవసాయ వ్యవస్థ కోసం కృషి చేస్తుంది. రాబోయే ఐదేళ్లలో.. 8,00,000 నుంచి 10 లక్షల మంది రైతులను చేరుకోవాలని, ఈ స్వయం సమృద్ధి గల వ్యవసాయ వ్యవస్థను ఒక ప్రముఖ సంఘటనగా మార్చాలని Isha Agro Movement  భావిస్తోంది. ఈషా ఆగ్రో మూవ్‌మెంట్ రైతులకు సహజ వ్యవసాయానికి ఎలా మారాలి అనే దానిపై మరింత అవగాహన, జ్ఞానాన్ని అందించడానికి.. ఈ పద్ధతిని నిలకడగా కొనసాగించడానికి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 

(Photo: Isha Foundation)

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్