ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్: రూ.22వేల మోటో ఎక్స్ 4 మొబైల్ కేవలం రూ.6,999లకే

First Published 22, Jun 2018, 6:34 PM IST
Highlights

ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్


న్యూఢిల్లీ: మోటో ఎక్స్ 4 మొబైల్ ఫోన్‌ను కేవలం రూ. 6,999లకే దక్కనుంది. ఫ్లిప్ కార్ట్  ఈ కామర్స్ సైట్ ఈ మేరకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.  వాస్తవానికి మోటో ఎక్స్ 4జీబీ ఫోన్ ధర రూ.22,999. బైబ్యాక్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ ఏడువేలకు అందించనుంది.

ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్  నిర్వహిస్తున్న సూపర్ వ్యాల్యూ వీక్‌లో భాగంగా  మోటో ఎక్స్ 4 స్మార్ట్‌ఫోన్ ను  ఏడు వేలకు  అందిస్తోంది. బై బ్యాక్ ఆఫర్స్ కింద ఈ  ఫోన్ ను కొనుగోలు చేస్తే  రూ. 16వేలను డిస్కౌంట్ కింద అందించనుంది. దీంతో ఈ ఫోన్ ధర రూ. ఏడువేలకు మాత్రమే పరిమితం కానుంది. 

అయితే  దీనికి సంబంధించి కొన్ని  నియమ నిబంధనలను  ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఆ నిబంధనలకు లోబడితేనే మోటో ఎక్స్ 4  స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకు మాత్రమే లభ్యం కానుంది. 

ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫర్ లో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.12 వేలను చెల్లించాల్సి ఉంటుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.అమెజాన్, ఫ్లిప్ ‌కార్ట్ ల మధ్య పోటీ వినియోగదారులకు ప్రయోజనం కల్గించే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 

Last Updated 22, Jun 2018, 6:34 PM IST