ఇప్పటికే మీకు 50 ఏళ్లు.. ప్లీజ్ ఇకపై ఒంటరిగా ఉండొద్దు - రాహుల్ గాంధీకి ఓవైసీ సెటైర్లు..

By Asianet NewsFirst Published Nov 26, 2023, 12:58 PM IST
Highlights

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయుకుడికి 50 ఏళ్లు వచ్చినా ఒంటరిగా ఉండటం వల్ల ఆయన తన మిత్రుడి గురించే ఆలోచిస్తూ ఉన్నారని అన్నారు. ఇక నుంచి అయినా ఒంటరిగా ఉండకూదని సూచించారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నాయకులు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటించి.. ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ స్నేహితులంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రాహుల్ గాంధీ కూడా రెండంటే ప్రేమని అన్నారు.

‘‘రాహుల్ గాంధీ కే దో ప్యార్ (రాహుల్ గాంధీకి రెండు ప్రేమలు) ఒకటి ఇటలీ. ఎందుకంటే ఆయన తల్లి అక్కడి నుంచి వచ్చారు. మరొకరు మోడీ. ఎందుకంటే మోడీ ఆయనకు అధికారం ఇస్తారు’’ అని ఓవైసీ ఓ సభలో అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని అమేథీ ప్రజలకు రాహుల్ గాంధీ మిత్రుడు కాదని, స్మృతి ఇరానీకి ఎందుకు స్నేహితురాలైందని ప్రశ్నించారు. 

Latest Videos

‘‘రాహుల్ గాంధీ.. దయచేసి ఇకపై ఒంటరిగా ఉండవద్దని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను(ఎందుకంటే) మీకు ఇప్పుడు 50 ఏళ్లు’’ అని అసుద్దుద్దీన్ ఓవైసీ అన్నారు. కాంగ్రెస్ ఎంపీకి ఇంట్లో తోడు లేకపోవడంతో ఆయన ఎప్పుడూ 'యార్' (స్నేహితుడు) గురించే ఆలోచిస్తారని, మాట్లాడతారని ఒవైసీ అన్నారు. ఇకపై ఇలాంటి పిచ్చికి పాల్పడవద్దని, ఇది సరైన వయసు కాదని సెటైర్లు వేశారు.

శనివారం తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించి.. అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వం అవినీతిమయమైందని ఆరోపించారు. బీఆర్ఎష్, బీజేపీ, ఎంఐఎం లు ఒక్కటే అని వ్యాఖ్యానించారు. మోడీకి ఇద్దరు మిత్రులు ఉన్నారని, ఒకరు ఒవైసీ, మరొకరు కేసీఆర్ అని అన్నారు. ప్రధానిగా మళ్లీ మోడీయే ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారని తెలిపారు. అలాగే ఇక్కడ కేసీఆరే సీఎంగా ఉండాలని మోడీ కోరుకుంటున్నారని విమర్శించారు. 

తనపై 24 కేసులు ఉన్నాయని, గతంలో తన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని రాహుల్ గాంధీ అన్నారు. అయితే కేసీఆర్ పై ఎలాంటి కేసులు లేవని, సీబీఐ, ఈడీ, ఇన్ కామ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వంటివేమీ ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ముందుగా తెలంగాణలో బీఆర్ఎస్ ను, ఆ తరువాత కేంద్రంలోని ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని రాహుల్ గాంధీ అన్నారు. 

click me!