యోగి సర్కార్ మిషన్ రోజ్‌గర్: 688 మందికి ఉద్యోగాలు

By Arun Kumar P  |  First Published Sep 11, 2024, 9:35 AM IST

ఉత్తరప్రదేశ్‌ యువతకు యోగి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.  

మిషన్ రోజ్‌గర్ కింద 647 మంది ఫారెస్ట్ గార్డులు/వన్యప్రాణుల రక్షకులు మరియు 41 మంది జూనియర్ ఇంజనీర్లకు నియామక పత్రాలను అందజేసింది. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన యువత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నియామకాలు చేపట్టినందుకు సీఎం యోగిని ప్రశంసించారు.


లక్నో. యోగి ప్రభుత్వం మిషన్ రోజ్‌గర్ కింద ఉత్తరప్రదేశ్ యువతకు ఉద్యోగాలు కల్పిస్తోంది. సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎంపికైన 647 మంది ఫారెస్ట్ గార్డులు, వన్యప్రాణుల రక్షకులు, 41 మంది జూనియర్ ఇంజనీర్లకు లోక్ భవన్ ఆడిటోరియంలో స్వయంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన యువతకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు... వారు సీఎంక కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం యోగి చొరవతోనే తాము పడిన కష్టానికి ఫలితం దక్కిందని నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నియామకాలు చేపట్టినందుకు సీఎంను, ప్రభుత్వాన్ని ప్రశంసించారు. 2017కి ముందు, ఆ తర్వాత జరిగిన ఉద్యోగ నియామకాల్లో వచ్చిన మార్పులను తమ అనుభవాలతో యువత వివరించింది. 2017కి ముందు బంధుప్రీతి, అవినీతి, అక్రమాలు, లంచగొండితనం ఉండేదని... ఇప్పుడు పూర్తి పారదర్శకత, నిష్పక్షపాతంతో నియామకాలు జరుగుతున్నాయని వారు తెలిపారు.

Latest Videos

undefined

 యోగి ప్రభుత్వం మాకు తోడుగా నిలిచింది

ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డులో జూనియర్ ఇంజనీర్‌గా నియమితులైన పూజ త్రిపాఠి మాట్లాడుతూ.. కష్టపడిన యువతకు ఈ నియామకాల ద్వారా ఉద్యోగాలు లభించాయని అన్నారు. చాలా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరగడంతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాం.... ఇది ప్రభుత్వం సాధించిన ఘన విజయమని అన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలవల్లే తనకు ప్రభుత్వ ఉద్యోగం లభించిందని... దీనికిగాను ముఖ్యమంత్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ముందుగానే నియామక పత్రాలు

వన్యప్రాణుల రక్షకుడిగా నియామకపత్రం అందుకున్న విజయ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. యువతకు ప్రభుత్వం అండగా నిలుస్తోందనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రం అందుకోవడం తన అదృష్టమన్నారు. యోగి ప్రభుత్వం యువతకు వేగంగా ఉద్యోగాలు కల్పిస్తోందని అన్నారు. ఫలితాలు వెలువడిన నెల రోజుల్లోనే నియామక పత్రాలు అందించడం గొప్ప విషయమని... యువతకు మంచి భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. రికార్డు స్థాయిలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారంటూ బిజెపి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.

సీఎం యోగి చేతులమీదుగా అపాయింట్ మెంట్ జీవితాంతం గుర్తిండిపోతుంది. 

పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖలో వన్యప్రాణుల రక్షకురాలిగా ఎంపికైన మురాదాబాద్‌కు చెందిన వర్షా రాణి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో ఉద్యోగాల కోసం లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని, కానీ నేడు కేవలం అర్హత, ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు లభిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు లంచాలు ఇవ్వడం గతానికి సంబంధించిన విషయమైందని, ముఖ్యమంత్రి పారదర్శక ప్రక్రియ ద్వారా నియామకాలు చేపట్టి ఉత్తరప్రదేశ్‌కు కొత్త మార్గాన్ని సుగమం చేశారని అన్నారు. ఈ ఉద్యోగానికి ఎలాంటి సిఫార్సులు, లంచాలు ఇవ్వాల్సిన అవసరం రాలేదని, దానికిగాను ముఖ్యమంత్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మహిళా సాధికారత దిశగా

బరేలీకి చెందిన జయ యాదవ్ ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డులో జూనియర్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి వల్లనే తాము నిష్పక్షపాత నియామక ప్రక్రియను చూస్తున్నామని ఆమె అన్నారు. మహిళల భద్రత నుంచి ఉద్యోగాల కల్పన వరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని... 688 మందిలో 128 మంది మహిళలకు నియామక పత్రాలు అందించడమే దానికి నిదర్శనమని అన్నారు. సీఎం యోగి నాయకత్వంలో మహిళలు తమను తాము సురక్షితంగా, బలంగా భావిస్తున్నారన్నారు, గతంలో బయటకు వెళ్తే భయపడాల్సి వచ్చేదని, కానీ నేడు ఎప్పుడైనా, ఎక్కడికైనా నిర్భయంగా వెళ్లగలుగుతున్నాం... అందుకే యోగి తమకు నెంబర్ 1 అని అన్నారు.

రెండు నెలల్లో రెండు సార్లు నియామక పత్రం అందుకున్నాను

రాంపూర్‌కు చెందిన సలీం అహ్మద్ పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖలో వన్యప్రాణుల రక్షకుడిగా ఎంపికయ్యారు. రెండు నెలల క్రితం లెక్‌పాల్‌గా కూడా ఎంపికయ్యారు. అతడు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ.. యోగి ప్రభుత్వం అవలంబిస్తున్న నిష్పక్షపాత నియామక ప్రక్రియకు తానే ఉదాహరణ అని అన్నారు. ఈ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఎక్కడా రాజీ పడటం లేదని, తన కష్టానికి, నిజాయితీకి ప్రభుత్వం తగిన గుర్తింపునిచ్చిందన్నారు, రెండు సార్లు పరీక్షలు రాసి రెండు సార్లు ఎంపికయ్యానని, మీరు అర్హులు, ప్రతిభావంతులైతే ఈ ప్రభుత్వంలో ఉద్యోగం సాధించడం కష్టం కాదని అన్నారు.

2017కి ముందు ఇంటర్వ్యూల ద్వారా యువతను, వారి కలలను తుడిచిపెట్టేవారని, కానీ నేడు ముఖ్యమంత్రి స్వయంగా యువతకు నియామక పత్రాలు అందజేస్తున్నారని అన్నారు. తన గ్రామానికి ఎప్పుడైనా ప్రభుత్వ అధికారి వస్తే తన తండ్రి శుభ్రం చేసేవారని, కానీ ఆయన కుమారుడు ఒకటి కాదు రెండు సార్లు ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యాడని, ఈ క్షణాన్ని మాటల్లో వర్ణించలేనని, ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ.. మళ్లీ యోగి ప్రభుత్వమే రావాలని, తద్వారా ఈ నిష్పక్షపాత నియామక ప్రక్రియ కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు.

click me!