కుంభమేళా ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం యోగి ... రేపు కూడా ప్రయాగరాజ్ లోనే

Published : Jan 09, 2025, 11:40 PM IST
కుంభమేళా ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం యోగి ... రేపు కూడా ప్రయాగరాజ్ లోనే

సారాంశం

రెండు రోజుల ప్రయాగరాజ్ పర్యటనలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. సాధువులతో సంభాషిస్తూ కుంభమేళా ఏర్పాట్లను తనిఖీ చేస్తున్నారు.

ప్రయాగరాజ్ :. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ (గురువారం) ప్రయాగరాజ్ లో పర్యటించారు. రేపు (శుక్రవారం) కూడా ఆయన ప్రయాగరాజ్‌లోనే వుంటారు. ఈ రెండు రోజులు పలు కార్యక్రమాలు, అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలిస్తారు. సాధువులతో సంభాషిస్తారు.

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు డీపీఎస్ మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్న యోగి సెక్టార్ 23లోని జడ్జెస్ కాలనీకి వెళ్తారు. 2:40కి అఖాడా సెక్టార్ 20లో ఖాక్ చౌక్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఇతర సాధువులను కలిసారు. ప్రతి అఖాడాలో సాధువులతో మాట్లాడారు.

ఇక సాయంత్ర సెక్టార్ 18లోని దండిబాడా శిబిరాన్ని పరిశీలించారు. అలాగే సెక్టార్ 3లో డిజిటల్ కుంభ్ అనుభవాన్ని ప్రారంభించారు. ఐటీఆర్‌సీసీలో అధికారులతో సమావేశమై డిజిటల్ మీడియా సెంటర్‌ను ప్రారంభించారు. సాయంత్రం రేడియో శిక్షణా హాలును పరిశీలించిన తర్వాత అఖాడాల సాధువులతో భోజనం చేసారు. అక్కడినుండి నేరుగా సర్క్యూట్ హౌస్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు.
 
ఇక రేపు శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆకాశవాణి ఛానల్‌ను ప్రారంభిస్తారు. 9:35కి బహుగుణ మార్కెట్‌లో కమలా బహుగుణ విగ్రహావిష్కరణ చేస్తారు. 10 గంటలకు నంది సేవా సంస్థ "అమ్మ భోజనశాల"ను ప్రారంభిస్తారు. 10:15కి ఎస్‌ఆర్‌ఎన్ ఆసుపత్రిని పరిశీలిస్తారు. 10:30కి ఐరావత ఘాట్‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు యూపీ స్టేట్ పెవిలియన్, డిజిటల్ కుంభ్ ప్రదర్శనను ప్రారంభిస్తారు. తర్వాత వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొని, మధ్యాహ్నం 2 గంటలకు బమ్రౌలీ విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు.

 

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu